నరేంద్ర సింగ్ తోమార్ | |
---|---|
![]() 2017లో మీడియాతో మాట్లాడుతున్న తోమర్, న్యూఢిల్లీ | |
15వ మధ్య ప్రదేశ్ శాసనసభ స్పీకర్ | |
Assumed office 2023 డిసెంబరు 20 | |
గవర్నర్ | మంగూభాయ్ సి. పటేల్ |
ముఖ్యమంత్రి | మోహన్ యాదవ్ |
అంతకు ముందు వారు | గిరీష్ గౌతమ్ |
మధ్య ప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడు | |
Assumed office 2023 డిసెంబరు 3 | |
అంతకు ముందు వారు | రవీంద్ర సింగ్ తోమర్ భిదోసా |
నియోజకవర్గం | డిమాని |
In office 1998–2008 | |
అంతకు ముందు వారు | రఘువీర్ సింగ్ |
తరువాత వారు | ప్రధుమాన్ సింగ్ తోమర్ |
నియోజకవర్గం | గ్వాలియర్ |
కేంద్ర కేబినెట్ మంత్రి, భారత ప్రభుత్వం | |
In office 2014 మే 26 – 2023 డిసెంబరు 7 | |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ |
2019 మే 30 – 2023 డిసెంబరు 7 | వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి |
2016 జులై 5- 2021 జులై 7 | గ్రామీణాభివృద్ధి మంత్రి, పంచాయతీ రాజ్ |
2020 సెప్టెంబరు 18 – 2021 జులై 7 | ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి |
2018 నవంబరు 13 –2019 మే 30 | పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి |
2017 సెప్టెంబరు 3 – 2019 మే 30 | గనుల మంత్రి |
2017 జులై 18 – 2017 సెప్టెంబరు 3 | హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ |
2014 మే 26 – 2016 జులై 5 | ఉక్కు మంత్రి , గనులు |
2014 మే 26 - 2014 నవంబరు 9 | కార్మిక , ఉపాధి మంత్రి |
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ | |
In office 2019 మే 23 – 2023 డిసంబరు 3 | |
అంతకు ముందు వారు | అనూప్ మిశ్రా |
తరువాత వారు | శివమంగళ్ సింగ్ తోమర్ |
నియోజకవర్గం | మోరెనా |
In office 2014 మే 16 – 2019 మే 23 | |
అంతకు ముందు వారు | యశోధర రాజే సింధియా |
తరువాత వారు | వివేక్ షెజ్వాల్కర్ |
నియోజకవర్గం | గ్వాలియర్ |
In office 2009 మే 31 – 2014 మే 16 | |
అంతకు ముందు వారు | అశోక్ ఛవిరామ్ అర్గల్ |
తరువాత వారు | అనూప్ మిశ్రా |
నియోజకవర్గం | మోరెనా |
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ | |
In office 2009 జనవరి 20 – 2009 మే 16 | |
అంతకు ముందు వారు | లక్ష్మీనారాయణ శర్మ |
నియోజకవర్గం | మధ్య ప్రదేశ్ |
మధ్య ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు | |
In office 2006 నవంబరు 20 – 2010 మార్చి | |
అంతకు ముందు వారు | సత్యనారాయణ జాతీయ |
తరువాత వారు | ప్రభాత్ ఝా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మోరార్, మధ్య ప్రదేశ్, భారతదేశం | 1957 జూన్ 12
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | కిరణ్ తోమర్ |
సంతానం | 3 |
నివాసం | భోపాల్, మధ్య ప్రదేశ్, భారతదేశం |
కళాశాల | జివాజి విశ్వవిద్యాలయం |
నరేంద్రసింగ్ తోమర్ (జననం: 1957 జూన్ 12) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు, మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యుడు.[1]అతను మెరానా నుండి 2009, 2019 లోక్‌సభ ఎన్నికలలో 15వ 17వ లోక్‌సభలకు, గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014 లోకసభ నుండి 16 లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు.[2] ఇతను మాజీ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి. అతను మొదటి, రెండవ మోడీ మంత్రిత్వశాఖల వివిధ కాలాలలో భారత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి, గనుల మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసారు.
నరేంద్ర సింగ్ తోమార్ ప్రస్తుతం మధ్య ప్రదేశ్ 16వ శాసనసభ స్పీకరుగా 2023 డిసెంబరు 20 నుండి అధికారంలో ఉన్నారు.
1957 జూన్ 12న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ జిల్లాలోని మోరార్ గ్రామంలో మున్షీ సింగ్ తోమార్, శారదా దేవి తోమార్ దంపతులకు సంతానంగా మోరార్ జన్మించాడు. జివాజీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అతని భార్య పేరు కిరణ్. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.[3][3] ఇతనికి బాబూలాల్ గౌర్ మున్నా భయ్యా అన్న మారుపేరు పెట్టాడు.[4]
2014 మే 26న క్యాబినెట్ మంత్రిగా నరేంద్ర సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో 2014 మే 27న స్టీల్, గనులు, కార్మిక, ఉపాధి కేంద్ర మంత్రిగా (క్యాబినెట్ ర్యాంక్) నియమితుడయ్యాడు.
2016 జూలై 5న, మోడీ రెండవ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో నరేంద్ర మోడీ మంత్రిత్వ, నరేంద్ర సింగ్ తోమర్ స్థానంలో బీరేంద్ర సింగ్ ని నియమించి. అప్పటివరకూ బీరేంద్ర సింగ్ చేపట్టిన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీరు, పరిశుభ్రతల మంత్రిగా, ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బీరేంద్ర సింగ్ స్థానంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పారిశుధ్యం మంచినీటి శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[5] నరేంద్ర సింగ్ తోమర్ స్థానంలో పియుష్ గోయల్ గనుల మంత్రిగా (కేబినెట్ హోదాలేని స్వతంత్ర్య మంత్రి).
2019 మే లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా కొనసాగాడు, అలానే వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు.