నర్తకి నటరాజ్ తమిళనాడుకు చెందిన భరతనాట్య నృత్యకారిణి. ఆమెకు భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. [1] దేశచరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు పద్మశ్రీ అవార్డు లభించడం ఇది మొదటిసారి.[2]
ఆమె దేవాలయాల నగరంగా పిలువబడుతున్న మదురై లో 1964లో జన్మించింది. ఆమె తంజావూరులోని కె.పి.కిట్టప్ప పిళ్ళై వద్ద 15 సంవత్సరాల పాటు నాట్య విద్యనభ్యసించింది. ఆమెకు నాట్యంపై ఆసక్తి ఉన్నా మానసికంగా మహిళగా భావించి ప్రవర్తించడంతో చాలామంది శిక్షణకు అనుమతించలేదు. అనేక కష్టాలు అవమానాలు ఎదుర్కొని నాట్యం నేర్చుకొని ఎవరైతే వంకపెట్టారో ఆ వంకపెట్టిన వారందరికీ కళకు కాదేదీ అనర్హం, కళ మనసులో ఉంటే సరిపోదు ప్రదర్శించినపుడే ఆత్మ సంతృప్తి అని భావించి ఆ కళను నేర్చుకొని ఎందరిచేతో అవార్డులు, ప్రసంశలు పొంది 2019లో భారత ప్రభుత్వంచే అత్యున్నత పౌర పురస్కారం "పద్మశ్రీ" ను పొందింది.
ఆమె పేదరికం, సామాజిక ఒత్తిడులతో పోరాడింది. ఆమె బాల్య స్నేహితుడు "శక్తి" తనకు ఆర్థిక సహాయాన్నందించాడు. బాల్యం నుండి స్త్రీలా తనను భావించుకుంది. కానీ ఆమె సామాజిక అన్యాయం, వివక్షతలకు గురి అయింది. ఈ కారణంగా ఆమె తన 12వ సంవత్సరంలో ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆమె జీవితాన్ని నిలబెట్టుకోవటానికి ఆమె కొన్ని ఉద్యోగాలను చేసింది.[3]
ఆమె భారతీయ, విదేశాలలోని విద్యార్థులకు తన స్వంత నాట్య పాఠశాల "వెల్లియామ్‌బల్లం స్కూల్ ఆఫ్ డాన్స్" ద్వారా నాట్యవిద్యను బోధిస్తుంది. ఈ పాఠశాల శాఖలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, నార్వే దేశాలలో కూడా ఉన్నాయి.
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]]