ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నర్రా వెంకటేశ్వర రావు | |
---|---|
జననం | 1947 |
మరణం | 2009 డిసెంబరు 27 హైదరాబాద్ | (వయసు 62)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1974-2009 |
జీవిత భాగస్వామి | సుశీల |
పిల్లలు | మురళి, వసంతలక్ష్మి |
నర్రా వెంకటేశ్వర రావు తెలుగు నటుడు.[1] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.
నర్రా వెంకటేశ్వర రావు 1947లో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించిన అనుభం ఆయనకుంది. ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి.
ఆయన 1974లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన చివరి సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేస్త్రి.
ఆయన డిసెంబరు 27, 2009న 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.