రకం | దినపత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
సంపాదకులు | ఎస్ వీరయ్య |
స్థాపించినది | 2015-03-21 |
భాష | తెలుగు |
కేంద్రం | హైదరాబాద్ |
జాలస్థలి | http://navatelangana.com/ |
నవతెలంగాణ ఇది తెలుగు దినపత్రిక. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలుగు దినపత్రిక అయిన ప్రజాశక్తిని ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసి, తెలంగాణలోని పత్రికశాఖలతో కూడినదానికి నవతెలంగాణగా పేరు మార్చబడినది. ఈ పత్రికకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం. జర్నలిస్టు వీరయ్య తొలి సంపాదకుడు.[1]
ఈ పత్రిక 2015 మార్చి 21 నాడు ఆవిర్భవించింది. పత్రిక ప్రారంభసమావేశానికి అన్ని రాజకీయపక్షాల నాయకులు హాజరయ్యారు.[2][3] ఈ పత్రిక తెలంగాణ అవిభాజ్య జిల్లాల ప్రాతిపదికన (ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ) ప్రత్యేక సంచికలను ప్రచురిస్తుంది.
2017-2018 కాలానికి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల ఆదాయం గత సంవత్సరపు ఆదాయంతో పోల్చితే 67% తగ్గింది.[4]
{{cite news}}
: CS1 maint: extra punctuation (link)