నవరంగ్ | |
---|---|
![]() నవరంగ్ | |
దర్శకత్వం | వి. శాంతారాం |
స్క్రీన్ ప్లే | వి.శాంతారాం |
కథ | జి.డి.మాడ్గుల్కర్ |
తారాగణం | మహీపాల్ సంధ్య |
ఛాయాగ్రహణం | త్యాగరాజ్ పెండార్కర్ |
కూర్పు | చింతామణి బోర్కర్ |
సంగీతం | సి.రామచంద్ర భరత్ వ్యాస్ (పాటలు) |
విడుదల తేదీ | సెప్టెంబరు 18, 1959 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నవరంగ్ 1959లో విడుదలైన హిందీ సినిమా. వి. శాంతారాం దర్శకత్వంలో ఈ సినిమా తీయబడింది[1]. ఈ సినిమాలో నటీమణి సంధ్యయ చేసిన నృత్యాలు[2] సి.రామచంద్ర సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ ఈ సినిమాలోని "ఆధా హై చంద్రమా రాత్ ఆధీ" అనే పాట ద్వారా సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[3]
దివాకర్ (మహీపాల్) ఒక కవి. అతి సాదాగా కనిపించే భార్య జమున(సంధ్య)ను చూసి ప్రేరణ పొంది మోహిని అనే ఒక కాల్పనిక సుందరిని ఊహించుకుని, కవిత్వం వ్రాస్తూ ఉంటాడు. దివాకర్ తండ్రి ఒక చిన్న సంస్థానంలో రాజోద్యోగి. ఇంగ్లీషు వాళ్లు వచ్చి యువరాజును వ్యసనాల పాలు చేసి రాజ్యాన్ని కబళిస్తారు. రాజు కవి బంధించి పాడమని నిర్బంధించి భంగపడతాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాడటం మూలాన కవి ఉద్యోగం ఊడుతుంది. ఫలితంగా అతడు తన రోగిష్టి తండ్రిని, తన కుమారుణ్ని పొషించలేక పోతాడు. ఇవన్నీ చూసి జమునలో కోపం పెరుగుతుంది. పైపెచ్చు తన ఊహాసుందరి మోహినపై కవిత్వం చెప్పడం చూసి ఆమె అతనితో జగడం చేసుకుని కొన్నాళ్లకు పుట్టింటికి వెళ్లిపోతుంది. అతడు కవిత్వం రాయడానికి ముడిసరకు దొరక్క వ్యర్థుడౌతాడు. చివరకు భార్య అర్థం చేసుకుని చేరువవుతుంది[4].
ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:భరత్ వ్యాస్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:సి.రామచంద్ర.
సం. | పాట | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఆ దిల్ సే దిల్ మిలా లే" | ఆశా భోస్లే | |
2. | "ఆధా హై చంద్రమా" | ఆశా భోస్లే, మహేంద్ర కపూర్ | |
3. | "అరే జా రే హట్ నట్‌కట్" | ఆశా భోస్లే, మహేంద్ర కపూర్ | |
4. | "కరి కరి కరి అంధియారి" | ఆశా భోస్లే, సి.రామచంద్ర | |
5. | "కవిరాజ కవితా కే మత్ అబ్ కాన్ మరోదే" | భరత్ వ్యాస్ | |
6. | "రానే దే రే" | ఆశా భోస్లే, మన్నా డే, సి.రామచంద్ర | |
7. | "శ్యామల్ శ్యామల్ బరణ్" | మహేంద్ర కపూర్ | |
8. | "తుం మేరే మై తేరీ" | ఆశా భోస్లే | |
9. | "తుమ్ పశ్చిమ్ హో హమ్" | సి.రామచంద్ర | |
10. | "తుం సైయా గులాబ్ కె" | ఆశా భోస్లే | |
11. | "తూ ఛుపీ హై కహా" | ఆశా భోస్లే, మన్నా డే | |
12. | "యే మాతీ సభీ కే కహానీ" | మహేంద్ర కపూర్ |
సంవత్సరం | విభాగం | పేరు | ఫలితం |
---|---|---|---|
1959 | ఉత్తమ ఎడిటింగ్ | చింతామణి బోర్కర్ | గెలుపు |
1960 | ఉత్తమ శబ్దగ్రాహకుడు | ఎ.కె.పర్మార్ | గెలుపు |
ఉత్తమ దర్శకుడు | వి. శాంతారాం | ప్రతిపాదించబడింది |