నవాబ్ | |
---|---|
దర్శకత్వం | మణిరత్నం |
రచన | మణిరత్నం శివ అనంత్ |
నిర్మాత | మణిరత్నం ఏ సుధాకరన్ వల్లభనేని అశోక్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సంతోష్ శివన్ |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ కుతుబ్-ఏ-కృప పాటలు: ఏఆర్ రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | మద్రాస్ టాకీస్ లైకా ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నవాబ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై తమిళంలో `చెక్క చివంద వానమ్` పేరుతో, తెలుగులో `నవాబ్`గా సెప్టెంబర్ 27న విడుదలైంది. అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు.[1]
భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) నగరంలోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు వరద(అరవింద్ స్వామి), త్యాగు (అరుణ్ విజయ్) & రుద్ర (శింబు). ఒకరోజు భార్య(జయసుధ) తో కలిసి వెళుతున్న భూపతి రెడ్డి పైన హత్యాయత్నం జరుగుతుంది తండ్రిని ఎవరు చంపించడానికి చూసారు అంటూ ముగ్గురు కొడుకులు ఆరా తీస్తుంటారు. ఇది తెలుసుకోవడానికి తమకి మిత్రుడైన రసూల్ (విజయ్ సేతుపతి) సహాయం కోరతాడు వరద. ఇంతలోనే గుండెపోటుతో ప్రకాష్ రాజ్ మరణిస్తాడు. ఆయన మరణం తరువాత ఆ స్థానంలోకి ఎవరు రావాలని ఆయన ముగ్గురి కొడుకుల మధ్య గొడవకి కారణమవుతుంది. ఇంతకి భూపతి రెడ్డి ని చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఈ ముగ్గురిలో ఎవరికి తండ్రి స్థానం దొరికింది ఎవరికీ అనేదే మిగతా సినిమా కథ.[2][3]
భారీ మల్టీస్టారర్.. రిలీజ్ డేట్ ఫిక్స్