నవీన్ నూలి | |
---|---|
జననం | |
వృత్తి | సినీ ఎడిటర్ |
పదవీ కాలం | 2012 - ప్రస్తుతం |
నవీన్ నూలి, తెలుగు సినిమా ఎడిటర్.[1] 2019లో వచ్చిన జెర్సీ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది.[2][3]
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, చిలిప్‌చేడ్ మండలం, రాందాస్‌గూడ గ్రామంలో నవీన్ జన్మించాడు.
నవీన్ స్నేహితుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 2012లో వచ్చిన లాగిన్ అనే హిందీ సినిమాతో ఎడిటర్ గా సినీరంగ ప్రవేశం చేసిన నవీన్, 2015లో వచ్చిన లేడీస్ & జెంటిల్ మెన్ సినిమా ఎడిటింగ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి (2015) సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్, నవీన్ ను సుకుమార్‌కు పరిచయం చేయడంతో నాన్నకు ప్రేమతో (2016) సినిమాకి ఎడిటిర్ గా అవకాశం వచ్చింది.[4][5] ఆ సినిమాతో మంచి ఎడిటర్ గా పేరు సంపాదించుకున్నాడు. 2019లో జెర్సీ సినిమాకు పనిచేశాడు.[6]
సంవత్సరం | అవార్డు | సినిమా పేరు | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
2015 | ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు | లేడీన్ & జెంటిల్‌మెన్ | గెలుపు | [4] |
2016 | నాన్నకు ప్రేమతో | |||
2019 | జీ సినీ అవార్డులు తెలుగు - ఉత్తమ ఎడిటర్ | రంగస్థలం | [7] |