నాగకేసరిచెట్తు విత్తనాలనుండి కూడా నూనెను తీయవచ్చును.ఈచెట్టు గట్టిఫెరెకుటుంబానికి చెందినది.వృక్షశాస్త్ర నామం:మెసుయ ఫెర్రె (లిన్నె) (mesua ferrea).ఈచెట్టును హిందిలో నహొర్/నాగ్‍కేశర్, కర్నాటకలో నాగసంపిగె, కేరళలో నంగు/ఛురాలి, తమిళనాడులో నంగల్/సురులి, మరాతి, గుజరాత్‍లో నాగ్‍చంప, అస్సాంలో నహొర్, ఒడిస్సాలో నగెస్‍వరొ (nageshwaro) బెంగాలిలో నగ్‍కెసర్ అనియు, ఆంగ్లంలో పగొడ చెట్టు (pogoda tree) అని వ్యవహరిస్తారు.
ఈచెట్లు తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమ (western ghats) లు, కర్నాటక, కేరళలోని సతతహరిత అడవుల్లో, అలాగే అస్సాం, బెంగాల్, అండమాన్ దీవులలోని అడవుల్లోను వ్యాప్తి చెంది ఉన్నాయి.దక్షిణ భారతంలోను వీటి వునికి ఉంది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం, అలాగే కేరళలోని పాలఘాట్ లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి. సముద్ర మట్టంనుండి 200 అడగుల ఎత్తు ప్రదేశాల్లో పెరుగును.
పూలు పుష్పించు కాలం చెట్లు పెరిగే ప్రాంతాన్ని బట్టి మారును. పూలు పూయడం ఫిబ్రవరి-మార్చినెలలలో మొదలై ఏప్రిల్-మే నెలల వరకు కొనసాగును. ఫలదీకరణ తరువాత పళ్లగా మారుటకు రెండు-మూడు మాసాలు పట్టును. పూలు తెల్లగా, తియ్యటి, కమ్మని వాసన కల్గి 7.5-10 సెం.మీ వ్యాసంతో కొమ్మల చివర ఒంటిగా కాని, లేదా జతగా కాని పుష్పించును.పూలను కడుపునొప్పి, ఆయాసం వంటి వాటి నివారణ మందులలో వినియోగుస్తారు. ఎండబెట్టిన పూలను/పూలలోని భాగాలను ఆయుర్వేద మందులతయారిలో ఉపయోగిస్తారు. కాయలు పళ్ళగా మారడం చెట్లు పెరుగు ప్రదేశాన్ని బట్టి మారును. బెంగాల్ లో జూలైనెల మధ్యనుండి సెప్టెంబరు వరకు, అస్సాంలో మే-జులైలో, వ్యానడ్ (కేరళ) లో డెసెంబరు-జనువరిలో, ట్రావెన్‍కూర్ (కేరళ) లోఅక్టొబరు-మార్చి నెలలలో పళ్ళు వచ్చును. పళ్లు ఎర్రగా, దీర్ఘ అండాకారంగా, గుండ్రంగా వుండును.3" (అంగుళాలు) వ్యాసం కల్గివుండును. ఒక్కో పండు 50-60 గ్రాములు వుండును. పెలుసైన గట్టి పెంకును కలిగి వుండును.ఒక పండులో 2-3 గింజలుందును. పై పెంకులో పీచు (Fibre) భాగం 50% వరకుండును. గింజలో విత్తనం (kernel)35% వరకుండును. గింజ పెంకులోపలి విత్తనం పసుపు రంగులో గుండ్రంగా వుండును [2].
సాధారణంగా పండి నేల రాలిన పళ్ళను సేకరించడం జరుగుతుంది. సేకరించిన పళ్లను దుడ్డు కర్రవంటి వాటితో బాది/నలగకొట్టి పళ్ళనుండి నూనె గింజలను వేరుచేయుదురు. సేకరించిన నూనె గింజలు పచ్చిగా వుండి తేమ శాతం అధికంగా వుండును. నూనెగింజలను కళ్లంలో ఆరబెట్టిన 50% వరకు బరువు తగ్గును. నిల్వ వుంచునప్పుడు చీడపీడలు ఆశించకుండుటకై 0.1% అల్‍డ్రెక్సు (Aldrex) ను నేలమీద చల్లెదరు. ఆతరువాతం.1% (నిల్వ వుంచిన గింజల పరిమాణంలో) హెక్షడొల్ (hexadol) ను గుంజలపై తరచుగా పిచికారి చేయుచుందురు. గింజలపైనున్న పెంకు (shell) ను పొట్టు తొలగించు యంత్రాల (Decorticators) ద్వారా తొలగించి, విత్తనాలను నూనెతీయు యంత్రాలలో (expellers) ఆడించి నూనెను తీయుదురు. నూనె బాగా దిగుబది రావటానికి విత్తనాలలో చిట్టూ (హల్లరు తవుడు) ను కలిపి యంత్రాలలో ఆడించెదరు.కేకులో మిగిలివున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా తీయుదురు.
నూనె గింజలో (seed) నూనెశాతం 40-45% వరకుండును. పైపెంకును తొలగించిన తరువాత విత్తనం (kernel) లో60-77% వరకుండును. నూనె చిక్కగా వుండును. స్నిగ్ధత అధికం. నూనె ఎరుపుగా లేదా ముదురు బ్రౌన్ రంగులో వుండును. చేదురుచి కలిగి, వికారంపుట్టించే వాసనతో వుండును. ఈ నూనె ఆహరయోగ్యంకాదు. పారిశ్రామిక రంగంలో ఇతర ప్రయోజనాలున్నాయి.
కొవ్వు ఆమ్లం | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 0.0-2.8 |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 8.0-16.5 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 10.0-15.8 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 55-66 |
లినొలిక్ ఆమ్లం (c18:2) | 10-20 |
అరచిడిక్ ఆమ్లం (C20:0) | 0-1.0 |
నూనెలో మిరిస్టిక్ ఆమ్లం, పామిటిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం, అరచిడిక్ ఆమ్లాలు సంతృప్త కొవ్వు ఆమ్లం లు.ఒలిక్ ఆమ్లం ఒకద్విబంధమున్న, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లంలు.
నూనెలోని భౌతిక, రసాయన ధర్మాలు
లక్షణము | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.465-1.475 |
అయోడిన్ విలువ | 65-95 |
సపొనిఫికెసను విలువ | 195-205 |
తేమ% | 1.0-1.5 |
రంగు 1/4" సెల్ (Y+5R) | 25-35 |
అన్‍సపోనిఫియబుల్ పదార్థం% | 2.0-2.5 |