నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యం | |
---|---|
వన్యప్రాణుల అభయారణ్యం | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా , గుంటూరు జిల్లా |
Established | 1983 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,568 కి.మీ2 (1,378 చ. మై) |
ఎత్తు | 917 మీ (3,009 అ.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
కాల మండలం | UTC+5:30 (IST) |
సమీప నగరం | శ్రీశైలం, హైదరాబాదు, గుంటూరు (316 కి.మీ. (196 మై.)) |
IUCN category | IV |
పర్యవేక్షన | నిరోధిత పర్యాటన |
పరిపాలనా సంస్థ | భారత ప్రభుత్వం, పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ , టైగర్ ప్రాజెక్టు |
అవపాతం | 1,000 మిల్లీమీటర్లు (39 అం.) |
వేసవి కాల సగటు ఉష్ణోగ్రత | 43 °C (109 °F) |
శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత | 16 °C (61 °F) |
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ.[1] అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ.రిజర్వాయర్లు, శ్రీశైలం ఆలయం పలువురు భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.[2]
అభయారణ్యం 78-30 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79-28 డిగ్రీల తూర్పు రేఖాంశం మద్య ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు 100 మీ నుండి 917 మీ వ్యత్యాసంలో ఉంటుంది. వార్షిక వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. ఈ అభయారణ్యంలో బహుళప్రయోజన రిజర్వార్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.అభయారణ్యం నల్లమల అరణ్యంలో పీఠభూమి, కొండశిఖరాలు మిశ్రితమైన ప్రాంతంలో ఉంది. ఇందులో 80% కంటే అధికంగా కొండప్రాంతం ఉంది. కొండల వరుసలలో ఎత్తైనకొండలు, లోయలు ఉన్నాయి. పర్వతమయ ప్రాంతంలో శ్రీశైలం, అంరాబాద్, పెద్దచెరువు, శివపురం, నెక్కెంటి వంటి గుర్తించతగిన పీఠభూమి ఉంది. నాగార్జునసాగర్ నైరుతీ ఋతుపవనాల నుండి వర్షపాతం అందుకుంటున్నది. జూన్ మూడవవారం నుండి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఒకనెల విరామం తరువాత అక్టోబరు మాసంలో ఈశాన్య ఋతుపవనాలు ఆరంభం ఔతాయి. జంతుసంచారం అధికంగా వర్షాకాలంలో పీఠభూములలో, వేసవికాలంలో కొండ లోయలలో ఉంటుంది. లోయప్రాంతంలో నీటిసరఫరా నిరంతరాయంగా లభిస్తున్నా పీఠభూమి ప్రాంతంలో మాత్రం వేసవిలో నీటి కరువు ఏర్పడుతుంది. అభయారణ్యాన్ని 200మీ లోతుతో, 130 కి.మీ దూరం విభజిస్తూ ఉంటుంది. అభయారణ్యంలో ఎత్తిపోతల జలపాతం, పెద్ద దూకుడు జలపాతం, గుండం, చాలేశ్వరం మొదలైన జలపాతాలు ఉన్నాయి. [2]
శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామికి పురాతన భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం భ్రమరాంబాదేవి పార్వతీదేవి అవతారాలలో ఒకటి. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగిఉంది. ఈ ప్రాంతంలో పురాతన నాగార్జున కొండ, నాగార్జున విశ్వవిద్యాలయ అవశేషాలు ఉన్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం సా.శ. 150 లో బుద్ధగురువు నాగార్జునాచార్యుని నిర్వహణలో ఉండేది. ఈ ప్రాంతం ఒకప్పుడు పలు బౌద్ధ విశ్వవిద్యాలయాలు, బౌద్ధారామాలతో విలసిల్లింది. క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందిన ఇక్ష్వాకు చంద్రగుప్తుని నివాసం నిర్జీవపురం లోయ నుండి కనిపిస్తూ ఉంటుంది. కాకతీయ ప్రతాపరుద్రుని పురాతన కోట, పలు పురాతన కోటలు కృష్ణానదీ తీరం వెంట కలిపిస్తూ ఉంటాయి. కాకతీయరాజులు నిర్మించిన 105మీ పొడవైన పురాతన కుడ్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో పలు రాక్ షెల్టర్ (శిలాశ్రయాలు), గుహలు ఆలయాలు ఉన్నాయి. వీటిలో అక్కమహాదేవి గుహలు (అక్కా మహాదేవి భిలం) దత్తాత్రేయ భిలం, ఉమా మహేశ్వరం, కదళీ వనం, పాలంకసారి వంటి ప్రాంతాలు ప్రధానమైనవి.[2]
" ది నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యం 1978 లో గుర్తించబడింది. 1983 లో ఇది " ప్రాజెక్ట్ టైగర్ " లో చేర్చబడింది.1992 లో దీనికి " రాజీవ్ గాంధి వన్యమృగ అభయారణ్యం " (రాజీవ్ గాంధి వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీగా) మార్చబడింది.1947లో స్వతంత్రం రాకమునుపు అభయారణ్యంలో దక్షిణ సగం మద్రాసు ప్రెసిడెంసీలో (బ్రిటిష్ ఇండియా) భాగంగా ఉండేది. ఉత్తరభాగం సగం " ప్రింసిలీ స్టేట్ ఆఫ్ హైదరాబాదు " (హైదరాబాదు నిజాం) ఆధీనంలో ఉండేది. అప్పుడీ ప్రాంతం రాజకుటుంబానికి వారి అతిధులకు మృగయావినోద ప్రాంతంగా ఉండేది.[2][3] అభయారణ్యంలో 1983లో 40 పులులు ఉండేవి. అభయారణ్యం ఆక్రమణలు, వణ్యమృగాల మేత, అగ్నిప్రమాదాలు (కార్చిచ్చు), చెట్లు, వెదురు అతిగావాడుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నది. జలవనరుల అభివృద్ధి, చెక్ డాంస్, కృత్రిమ ద్రోణులు మొదలైన ఏర్పాట్లు అభయారణ్యం పునరభివృద్ధికి సహకరించింది. 1989లో పులుల సంఖ్య 94కు (6 సంవత్సరాలలో 130% అభివృద్ధి) చేరుకుంది.1993 లో ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ప్రవేశించిన తరువాత 2016 నాటికి అభయారణ్యంలోని పులుల సంఖ్య 110కి చేరుకుంది.[4]
అభయారణ్య ప్రాంతంలో ప్రధాన వృక్షజాలంలో దక్షిణ ఉష్ణమండల మిశ్రిత ఆకురాల్చే అరణ్యం, హార్డ్ వికియా ఫారెస్ట్, డక్కన్ త్రోన్ స్క్రబ్ ఫారెస్ట్ ఉంది. ఇందులో యుఫోర్బియా పొదలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా అనోజీస్సస్ మార్సుపియం, హార్డ్‌వికియా బినాటా (అంజాన్ ట్రీ), బోస్వెల్లా సెర్రటా (ఇండియా ఫ్రాంకింసెంస్ ఆర్ సాలై), టెక్టోనా గ్రాండీస్ (టీక్), ముందులీ సెర్సియా, అల్బిజాల్ (సిల్క్ ప్లాంట్స్).[2]
అభయారణ్యంలో బెంగాల్ పులి, ఇండియన్ చిరుత, స్లోత్ ఎలుగుబంటు, ఉస్సూరి ధోలే, దుప్పి, కనితి, చెవ్రోటైన్, బ్లాక్ బక్, చింకారా, చౌసింఘా (కొండ గొర్రె) మొదలైన జంతువులు ఉండేవి. అదనంగా ముగ్గర్ క్రొకొడైల్, ఇండియన్ పైథాన్, రాజనాగం, ఇండియన్ పీఫౌల్ కూడా ఉన్నాయి.[2]
ఆయుధాలు ధరించిన తీవ్రవాదుల ఉనికి అభయారణ్య నిర్వహణకు, పులుల సంరక్షణకు తీవ్రమైన సమస్యగా పరిగణించబడుతుంది. సమాచారవ్యవస్థ బలహీనంగా ఉన్నందున సహాయ సిబ్బంధి ఆటవీప్రాంతం లోతట్టు ప్రాంతాలకు వెళ్ళటానికి భయపడుతుంటారు. సమీపంలోని 5 జిల్లాలలో కొయ్య, వంటచెరుకు అవసరాలకు అభయారణ్య ప్రాంతం ఒయాసిస్సులా భావించబడుతుంది. స్మగ్లర్లు లోతట్టు ప్రాంతాల నుండి కొయ్యను మైదానాలకు తరలిస్తుంటారు. అభయారణ్య సరిహద్దు ప్రాంతాలలో పశువుల మేత వత్తిడి కూడా పెద్దసమస్యగా మారింది. పులులు పెంపుడు జంతువులు, మానవుల మీద దాడి చేయడం సమస్యలకు పరిష్కారం వెకకవలసిన అవసరం ఉంది. అన్ని సమస్యలు అటవీ సహజసంపద రక్షణకు సవాలుగా మారాయి.[4]
అభయారణ్యం లోపల, పరిసరాలలో దాదాపు 200 గ్రామాలు ఉన్నాయి. వీటిలో అభయారణ్యం పరిమితిలో 120 గ్రామాలు ఉన్నాయి. అభయారణ్యం కేంద్రప్రాంతంలో 24 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 557 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనసంఖ్య 2,285 వీరిలో అధికంగా చెంచుప్రజలు ఉన్నారు. అభయారణ్యం పరిమితిలో 8,432 కుటుంబాలు ఉన్నాయి ప్రజల సంఖ్య 43,978. అభయారణ్యం సరిహద్దుప్రాంతాలలో 24,531 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనసంఖ్య 1,22,751. అభ్యయారణ్యం జనసాంధ్రత 0.2 చ.కి.మీ. 1981-1991 జనసంఖ్యాభివృద్ధి 1.3%.అభయారణ్యం కేంద్రప్రాంతంలో ఉన్న గ్రామాలలో 15,000 పెంపుడు జంతువులు ఉన్నాయి. వార్షిక పెంపుడు జంతువుల అభివృద్ధి 400. మిగిలిన అభయారణ్యప్రాంతంలో పెంపుడు జంతువుల సంఖ్య 43,350. వర్షాలు ఆరంభం అయిన వెంటనే మైదానాల నుండి 3,00,000 వలసజంతువులు అభయారణ్యంలో ప్రవేశిస్తుంటాయి.[2] 10 సంవత్సారాల కాలంలో ఒకగ్రామం మాత్రం స్థలమార్పిడి అయింది. మిగిలిన గ్రామాలను స్థలమార్పిడి చేయాలని ప్రయత్నించారు. అయినప్పటికీ పరిమితమైన జీవన సౌకర్యాలకు అలవాటుపడిన చెంచుప్రజలు సహజవాతావరణంలో జీవించడానికి ప్రాధాన్యత ఇస్తారు కనుక వారు అరణ్యప్రాంతాలలో నివసించడం అడవికి రక్షణగా ఉంటుందని భావిస్తున్నారు. శ్రీశైలం రహాదారి ప్రక్కన ఉన్న గ్రామం వ్యవసాయగ్రామంగా అభివృద్ధి చెందుతూ ఉంది. వారు అటవీప్రాంతాన్ని ఆక్రమించేలోపల ఆగ్రామాన్ని స్థలమార్పిడి చేయాలని తీవ్రప్రయత్నాలు ఆరంభించారు.[4]
టైగర్ ప్రాజెక్టు కొరకు సిబ్బంధిని 5 జిల్లాల నుండి ఎన్నుకుంటారు. చట్టాల అనుసారం ఏ జిల్లకు చెందిన వారిని ఆజిల్లాలోనే నియమించాలి. అభయారణ్య ప్రాంతం అంతా ఫీల్డ్ డైరెక్టర్ ఆధీనంలోకి తీసుకురావడానికి వ్యూహాత్మకమైన ప్రణాళిక రూపొందించబడింది. వన్యప్రాణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్న కె. తులసీరావును ఎకో డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసరుగా ప్రభుత్వం నియమించడంతో పులుల సంరక్షణ, అభివృద్ధికి చేపట్టిన పనులు సత్ఫలితాలనిచ్చాయి. అటవీ సిబ్బంధి తీవ్రవాదుల ఉనికి కారణంగా పలు సమస్యలను, ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంది. దీనిని ఎదుర్కొనడానికి అటవీ సిబ్బంధి ధైర్యసాహసాలతో పనిచేయవలసిన అవసరం ఉంది. శాకాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండడం పెంపుడు జంతువుల మీద క్రూరమృగాలు దాడిచేయడం సంబంధంగా పరిశోధన జరగవలసిన ఆవశ్యకత ఉంది. ఆహార ఆధారిత విశ్లేషకుల అవసరం అత్యవసరం.[4]
అభయారణ్యంలో భవిష్యత్తు ప్రణాళికలో నీటివనరుల అభివృద్ధి, వెల్ఫేర్ మెషర్ ఫర్ పీపుల్, మొక్కల పెంపకం, బయోగ్యాస్ ప్లాంటు, సోలార్ పంపు సెట్లు, పొగలేని పొయ్యి వంటి పధకాలు రూపొందించబడ్డాయి. స్మగ్లర్లను, తీవ్రవాదులను ఎదుకోవడానికి బోట్లు, జీపులు, వైర్లెస్ సెట్ల ఏర్పాటు చేయడం. అధికమైన పశ్చికమైదానాలను అభివృద్ధి చేయడం. అగ్నిమాపకదళాలను అధికం చేయడం భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ఉంది.అభయారణ్యంలో పర్యావరణ విద్యాకేంద్రం ఉంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ భాగంగా ఉంది. తీవ్రవాదుల నిర్మూలనచేసి అభయారణ్యాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకురావడం. తీవ్రవాదుల చొరబాటు కారణంగా టైగర్ ప్రాజెక్టు నిర్వహణ, పరిశోధనకార్యక్రమాలు తీవ్రంగా బాధించబడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లభించక పరిశోధనలు ప్రారంభించబడలేదు.[4]