ప్రభుత్వ స్థానం | కోహిమా |
---|---|
చట్ట వ్యవస్థ | |
అసెంబ్లీ | |
స్పీకరు | షేరింగ్గైన్ లాంగ్‌కుమర్ |
డిప్యూటీ స్పీకరు | ఖాళీ |
అసెంబ్లీలో సభ్యులు | 60 |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | లా. గణేషన్ |
ముఖ్యమంత్రి | నెయిఫియు రియో |
ఉప ముఖ్యమంత్రి | టి.ఆర్. జెలియాంగ్ యంతుంగో పాటన్ |
న్యాయవ్యవస్థ | |
హైకోర్టు | కోహిమా బెంచ్, గౌహతి హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | విజయ్ బిష్ణోయ్ |
నాగాలాండ్ ప్రభుత్వం లేదా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. ఇది నాగాలాండ్ రాష్ట్రం, దాని 16 జిల్లాల పాలక అధికారం సాగించే సంస్థ. ఇది నాగాలాండ్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసన శాఖను కలిగి ఉంటుంది. కోహిమా నాగాలాండ్ రాజధాని. విధానసభ (శాసనసభ) సచివాలయం కోహిమా నగరంలో ఉన్నాయి.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, నాగాలాండ్ రాష్ట్ర అధిపతి గవర్నరు, కేంద్ర ప్రభుత్వ సలహాపై భారత రాష్ట్రపతి నియమిస్తారు.అతని లేదా ఆమె పదవి ఎక్కువగా ఉత్సవంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధిపతి. చాలా కార్యనిర్వాహక అధికారాలు ముఖ్యమంత్రి కలిగి ఉంటారు.నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరాన్ని 'నిర్మాణ కార్మికుల సంవత్సరం'గా ప్రకటించింది [1]
వ.నెం | పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|---|
1. | నెయిఫియు రియో
ముఖ్యమంత్రి |
ఉత్తర అనాగమి II |
( ఏ మంత్రికి కేటాయించని ఇతర అన్ని శాఖలు) |
NDPP | |
ఉపముఖ్యమంత్రి | |||||
2. | టి.ఆర్. జెలియాంగ్ | పెరెన్ |
|
NDPP | |
3. | యంతుంగో పాటన్ | టియు |
|
బిజెపి | |
కేబినెట్ మంత్రులు | |||||
4. | సి.యల్. జాన్ | తెహోక్ |
|
NDPP | |
5. | జి. కైటో ఆయ్ | సతఖా |
| ||
6. | జాకబ్ జిమోమి | ఘస్పని I |
|
బిజెపి | |
7. | కె.జి. కెనీ | చిజామి |
|
NDPP | |
8. | మెట్సుబో జమీర్ | మోకోక్‌చుంగ్ టౌన్ |
| ||
9. | బషంగ్మోంగ్బా చాంగ్ | ట్యూన్‌సాంగ్ సదర్-I |
|
బిజెపి | |
10. | పైవాంగ్ కొన్యాక్ | టిజిట్ |
| ||
11. | సల్హౌతునొ క్రుసె | పశ్చిమ అంగామి |
|
NDPP | |
12. | టెంజెన్ ఇమ్నా వెంట | అలోంగ్టాకి |
|
బిజెపి |
ప్రస్తుత నాగాలాండ్ శాసనసభ ఏకసభ్యమైంది. ఇందులో 60 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.ఎ.) ఉన్నారు. ఏదేని పరిస్థితులలో గవర్నరు దీనిని త్వరగా రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు. [2]
అస్సాంలోని గౌహతిలో ఉన్న గౌహతి ఉన్నత న్యాయస్థానం నాగాలాండ్ రాష్ట్రంలో తలెత్తే కేసులకు సంబంధించి అధికార పరిధిని, అధికారాలను వినియోగించే కొహిమా బెంచ్‌ని కలిగి ఉంది.
నాగాలాండ్‌లోని పదహారు జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక డిప్యూటీ కమిషనర్ (డిసి) ఉంటారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను "ఉప-విభాగాలు"గా విభజించారు. వీటిలో ప్రతిదానికి ఒక్కటి అడిషనల్ డిప్యూటీ కమీషనర్ (ఎడిసి) పరిపాలనా బాధ్యతలను కలిగి ఉంటాడు. పెద్ద సబ్-డివిజన్‌కు సబ్-డివిజన్‌లోని అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్‌లకు బాధ్యత వహించే అనేక సబ్-డివిజనల్ ఆఫీసర్లు (ఎస్.డి.ఓ) లేదా అదనపు అసిస్టెంట్ కమిషనర్‌లు (ఇఎసిలు) కూడా అవసరం కావచ్చు. [3]