నాగేంద్ర ప్రసాద్ | |
---|---|
జననం | నాగేంద్ర ప్రసాద్ సుందరం 19 డిసెంబరు 1975 మైసూరు, మైసూర్ రాష్ట్రం |
జాతీయత | ![]() |
వృత్తి | నటుడు కొరియోగ్రాఫర్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | రాజు సుందరం (సోదరుడు) ప్రభుదేవా (సోదరుడు) |
నాగేంద్ర ప్రసాద్ సుందరం (జననం 1975 డిసెంబరు 19) భారతీయ చలనచిత్ర నృత్య దర్శకుడు(కొరియోగ్రాఫర్). తమిళ, కన్నడ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన నటుడు కూడా. ఆయన సుందరం మాస్టర్ చిన్న కుమారుడు. అలాగే, ప్రభుదేవా, రాజు సుందరంలకు తమ్ముడు.
ఆయన బొంబాయి చిత్రంలోని హమ్మా హమ్మా.. పాటలో నటించినందుకు అత్యంత ప్రసిద్ధి చెందాడు.[1] ఆయన కన్నడ చిత్రం చిత్రలో రేఖ వేదవ్యాస్ సరసన నటించి అరంగేట్రం చేశాడు. తన తండ్రి సుందరం మాస్టర్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం మనసెల్లా నీనేలో కూడా ఆయన నటించాడు.[2][3] ఆయన కుషి (2000), ఘిల్లి (2004), మాస్టర్ (2021) వంటి అనేక తమిళ చిత్రాలలో హీరో స్నేహితుడిగా నటించాడు. ఆయన నటించిన ఘిల్లి ( రిస్క్ టేకర్) [4] తెలుగు భాషా చిత్రం ఓక్కడు (2003) రీమేక్ కాగా, మాస్టర్ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషాల్లో కూడా విడుదలైంది.[5]
ఆయన స్టార్ విజయ్‌లో మాయ మచింద్ర అనే టెలి-సీరియల్‌లో కూడా నటించాడు.[6] ఆయన జోడి నంబర్ 1 సీజన్ 7లో పాల్గొన్నాడు. తన తండ్రి పేరు మీద డ్యాన్స్ స్కూల్, ఎం.ఎస్.ఎం డ్యాన్స్ స్కూల్ ని ఆయన నిర్వహిస్తున్నాడు.
ఆయన హేమలతను వివాహం చేసుకున్నాడు.
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)