నాగేంద్ర సింగ్ | |
---|---|
![]() 1985 లో హేగ్‌లో అంతర్జాతీయ లాయర్ల అసోసియేషను కాంగ్రెసులో క్వీన్ బియాట్రిక్స్‌తో నాగేంద్ర సింగ్ | |
అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు | |
In office 1985–1988 | |
అంతకు ముందు వారు | తస్లీం ఎలియాస్ |
తరువాత వారు | జోస్ రూడా |
4 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు | |
In office 1972 అక్టోబరు 1 – 1973 ఫిబ్రవరి 6 | |
అంతకు ముందు వారు | ఎస్.పి.సేన్ వర్మ |
తరువాత వారు | టి.స్వామినాథన్, |
వ్యక్తిగత వివరాలు | |
జననం | దుంగార్పూర్, రాజస్థాన్ | 1914 మార్చి 18
మరణం | 1988 డిసెంబరు 11 ది హేగ్, నెదర్లాండ్స్ | (వయసు: 74)
జాతీయత | భారతీయుడు |
కళాశాల | మేయో కాలేజి సెంట్ స్టీఫెన్స్ కాలేజి, కేంబ్రిడ్జి |
నాగేంద్ర సింగ్ (1914 మార్చి 18 - 1988 డిసెంబరు 11) 1985 నుండి 1988 వరకు అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయ న్యాయవాది, ప్రభుత్వ అధికారి.[1] హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులుగా పనిచేసిన భారతదేశానికి చెందిన నలుగురు న్యాయమూర్తులలో ఆయన ఒకడు. ఇతరులు బి.ఎన్. రావు (1952-1953) ICJలో మొదటి భారతీయ న్యాయమూర్తి, ఆర్.ఎస్. పాఠక్ (1989-1991), దల్వీర్ భండారీ.[2] 1972 అక్టోబరు 1 నుండి 1973 ఫిబ్రవరి 6 వరకు సింగ్, భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేశాడు.
నాగేంద్ర సింగ్ 1914 మార్చి 18 న దుంగార్‌పూర్ రాజ్యంలో రాజా విజయ్ సింగ్ I, రాణి దావేంద్ర దంపతులకు జన్మించాడు; దుంగార్పూర్ చివరి చక్రవర్తి లక్ష్మణ్ సింగ్ I. అతని అన్నయ్య. సివిల్ సర్వీస్‌లో చేరడానికి ముందు అతను కేంబ్రిడ్జ్‌లోని సెయింట్ జాన్స్ కాలేజీలో చదువుకున్నాడు.[3]
అతను ఇండియన్ సివిల్ సర్వీస్‌లో చేరి, తూర్పు రాష్ట్రాలకు ప్రాంతీయ కమిషనర్‌గా పనిచేసాడు. భారత రాజ్యాంగ సభ సభ్యుడుగా, భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా, రవాణా డైరెక్టర్ జనరల్‌గా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశాడు.[4]
1966, 1972 మధ్య సింగ్, భారత రాష్ట్రపతికి కార్యదర్శిగా పనిచేసాడు.[4] ఆ తర్వాత 1972 అక్టోబరు 1 నుండి 1973 ఫిబ్రవరి 6 వరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసాడు.[5] 1966, 1969, 1975 సంవత్సరాల్లో, అతను ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. 1967 నుండి 1972 వరకు పార్ట్ టైమ్ ప్రాతిపదికన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లా కమిషన్‌లో పనిచేశాడు. ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యాడు. 1973 లో, హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి అయ్యాడు. 1985 1988 ఫిబ్రవరి 1988 ఫిబ్రవరి మధ్య దాని అధ్యక్షుడిగా పనిచేసి పదవీ విరమణ చేసాడు.[6] అతను హేగ్‌లో స్థిరపడ్డాడు. 1988 డిసెంబరులో మరణించాడు.
1938 లో సింగ్‌కు కామా అవార్డు లభించింది. 1973లో భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్‌ను అందుకున్నాడు.[7]