నాటకాల రాయుడు (1969 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎ. సంజీవి |
నిర్మాణం | దిడ్డి శ్రీహరిరావు |
తారాగణం | నాగభూషణం, కాంచన, కైకాల సత్యనారాయణ, చిత్తూరు నాగయ్య, బి.పద్మనాభం, ప్రభాకరరెడ్డి |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
గీతరచన | ఆత్రేయ |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
నిర్మాణ సంస్థ | హరిహర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నాటకాల రాయుడు 1969లో విడుదలైన తెలుగు సినిమా. ఇది హిందీ చిత్రం 'ఆల్బెలా' (Albela, 1951) (భగవాన్ కథానాయకునిగా) ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో గాయని పి.సుశీల పాడిన 'నీలాల కన్నుల్లో మెలమెల్లగా' పాట జనరంజకమైనది. (హిందీలో సి.రామచంద్ర స్వరకల్పనలో తయారైన పాట ఆధారంగా)
బుజ్జిబాబు (నాగభుషణం) కు నాటకాల పిచ్చి. తండ్రి ఉద్యోగాలు వేయిస్తుంటే ఆ నాటకాల పిచ్చి మూలంగా అన్నింటిని పోగొట్టుకుంటాడు. చివరికి కోపం వచ్చి తండ్రి ఆదిశేషయ్య (నాగయ్య) బుజ్జిబాబును ఇంటి నుండి గెంటివేస్తాడు. అయినా తల్లి (హేమలత) మాత్రం మహానటుడు కమ్మని దీవిస్తుంది. తండ్రి కూతురి పెళ్ళి కోసం అప్పులు చేస్తాడు. అన్నయ్య రామారావు (సత్యనారాయణ) చెల్లి పెళ్ళి కోసం భార్య నగలు అమ్మేస్తాడు. అయితే ఆ డబ్బంతా దొంగలు ఎత్తుకు పోతారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కూతుర్ని తల్లి చేరదీస్తుంది. ఇల్లు వదిలి చాలా కష్టాలు పడి చివరికి రంగమార్తాండ నాటక సంస్థ యజమాని గీతాదేవి (కాంచన) ఇంట్లో పనివాడుగా చేరి ఆమె అభిమానాన్ని సంపాదిస్తాడు. ఆ కంపెనీ మేనేజర్ రాజశేఖర్ (పద్మనాభం), హీరో ప్రేమ్ కుమార్ (ప్రభాకర రెడ్డి) లు ఎంతగా ప్రతిఘటించినా చివరికి మంచి నటుడిగా ఎదిగి పేరుతెచ్చుకుంటాడు.