నాదెండ్ల మనోహర్ | |||
నాదెండ్ల మనోహర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | కారుమూరి వెంకట నాగేశ్వరరావు | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు చేయబడింది | ||
పదవీ కాలం 4 జూన్ 2011 – 18 జూన్ 2014 | |||
ముందు | ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి | ||
తరువాత | కోడెల శివప్రసాదరావు | ||
పదవీ కాలం 9 జూన్ 2009 – 3 జూన్ 2011 | |||
ముందు | డాక్టర్ జి. కుతూహులమ్మ | ||
తరువాత | మల్లు భట్టివిక్రమార్క | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | అన్నాబత్తుని శివకుమార్ | ||
నియోజకవర్గం | తెనాలి | ||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | గోగినేని ఉమా | ||
తరువాత | ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | ||
నియోజకవర్గం | తెనాలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తెనాలి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1964 ఏప్రిల్ 6||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ (12 అక్టోబర్ 2018 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (12 అక్టోబర్ 2018 ముందు) | ||
తల్లిదండ్రులు | నాదెండ్ల భాస్కరరావు | ||
జీవిత భాగస్వామి | డా. నాదెండ్ల మనోహరం | ||
సంతానం | మితుల్ నాదెండ్ల, లలిత్ నాదెండ్ల |
నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను జనసేన పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను తెనాలి శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరాడు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
నాదెండ్ల మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు.
మనోహర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2009లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్‌లో శాసనసభ స్పీకర్‌గా నియమితుడై 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా పని చేశారు. నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2018 అక్టోబర్‌లో జనసేన పార్టీలో చేరి[1][2] 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో NSUI, యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టిసారించాడు.
మనోహర్ జాతీయస్థాయి టెన్నిస్ ఆటగాడు. ఇతను దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. ఇతను 1986 నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.