నాన్నకు ప్రేమతో | |
---|---|
![]() చిత్ర ప్రచార పత్రిక | |
దర్శకత్వం | సుకుమార్ |
రచన | సుకుమార్ |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | ఎన్.టి.ఆర్. (తారక్) రకుల్ ప్రీత్ సింగ్ డా.రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబు |
ఛాయాగ్రహణం | విజయ్ సి చక్రవర్తి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | రిలాయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 13 జనవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నాన్నకు ప్రేమతో 2016 జనవరి 13న విడుదలైన తెలుగు సినిమా.[1] నాన్నకు ప్రేమతో సంక్రాంతికి ప్రేమతో ట్రైలర్ [2]
అభిరామ్ (ఎన్టీఆర్) లండన్లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. తొలి సన్నివేశం లోనే తన భావోద్వేగాలనును దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కొత్త సంస్థ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం (గద్దె రాజేంద్ర ప్రసాద్ )కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్నదమ్ముల (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.
ఈ క్రమంలో లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరాంను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.
క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఫాలో ఫాలో యూ" | దేవీశ్రీ ప్రసాద్ | ఎన్.టి.ఆర్. (తారక్) | 03:38 | |||||
2. | "నా మనసు నీలో" | భాస్కరభట్ల రవికుమార్ | దేవీశ్రీ ప్రసాద్, శర్మిల | 04:21 | |||||
3. | "డోంట్ స్టాప్" | చంద్రబోస్ (రచయిత) | రఘు దీక్షిత్ | 03:53 | |||||
4. | "లవ్ మి అగైన్" | చంద్రబోస్ | సూరజ్ సంతోష్ | 04:06 | |||||
5. | "లవ్ దెబ్బ" | చంద్రబోస్ | దీపక్, శ్రావణ భార్గవి | 03:56 | |||||
19:54 |
2016 సైమా అవార్డులు