నామగిరిపేట్టై కాథన్ కృష్ణన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | நாமகிரிப்பேட்டை கிருஷ்ணன் |
జననం | నామగిరిపేట్టై, తమిళనాడు | 1924 ఏప్రిల్ 2
మరణం | 2001 ఏప్రిల్ 30 | (వయసు: 77)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | నాదస్వర విద్వాంసుడు |
వాయిద్యాలు | నాదస్వరం |
నామగిరిపేట్టై కె. కృష్ణన్ ( 1924 – 2001) ఒక కర్ణాటక సంగీత నాదస్వర విద్వాంసుడు.
ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని నామగిరిపేట్టై గ్రామంలో 1924, ఏప్రిల్ 2వ తేదీన ఒక కర్ణాటక సంగీత కుటుంబంలో జన్మించాడు. ఇతడు సెందమంగళం గ్రామంలో నివసించాడు. ఇతడు నాదస్వరంలో శిక్షణను తన తాత చిన్నప్ప మొదలియార్ వద్ద, అరుప్పుకొట్టై గణేశపిళ్ళైల వద్ద తీసుకున్నాడు[1]. ఇతడు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. నాదస్వరంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా ఇతనికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1972లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడిని కళైమామణి పురస్కారంతో గౌరవించింది. 1974లో తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆస్థాన విద్వాంసుడిగా నియమించబడ్డాడు. 1977లో తమిళనాడు ప్రభుత్వం ఇతడిని ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించింది. 1981లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇతడికి ప్రకటించింది.[2] 1981లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం - వాద్యం (నాదస్వరం) విభాగంలో అవార్డును ప్రకటించింది. ఇతడు ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాడు. తిరువాయూరులోని త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు ఉపాధ్యక్షుడిగా సేవలను అందించాడు.