నామనారాయణి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 50వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "నామదేశి" అని పిలుస్తారు.[3]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R1 G3 M2 P D1 N2 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M2 G3 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 14వ మేళకర్త రాగమైన వకుళాభరణం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.