నామా నాగేశ్వరరావు | |||
నామా నాగేశ్వరరావు | |||
పార్లమెంటు సభ్యులు
| |||
పదవీ కాలం 2019 - ప్రస్తుతం | |||
ముందు | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బలపాల, ఖమ్మం జిల్లా | 1957 మార్చి 15||
జీవిత భాగస్వామి | చిన్నమ్మ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
మతం | హిందు |
నామా నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
నాగేశ్వరరావు 1957, మార్చి 15న మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, బలపాల గ్రామంలో నామ ముత్తయ్య - వరలక్ష్మి దంపతులకు జన్మించాడు.[2]
నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.[3]
17వ లోక్‌సభకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటిసారిగా లోక్‌సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయాడు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 125000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుండి 11,000 ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[5] ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019, మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] నామా నాగేశ్వరరావు 2019లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఉన్నాడు.[7]
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, పార్లమెంటరీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకొబడ్డాడు. హిందీ, తెలుగు భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలడు. కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చించటానికి పార్లమెంటు నుండి వెళ్లిన అఖిల పక్ష బృందంలో సభ్యుడిగా ఉన్నాడు.
నాగేశ్వరరావు రాజకీయాలలో ప్రవేశించక మునుపే ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు. మధుకాన్ కంపెనీకి ఛైర్మైన్ గా ఉన్నాడు.[8] ఈ సంస్థ గ్రానైట్, కాంట్రాక్ట్ లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇతరత్రా వ్యాపారాలని నిర్వహిస్తున్నది. 2009 లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని నమోదు చేసినప్పుడు తన ఆస్థుల విలువ 173 కోట్లుగా ప్రకటించాడు. ఈయన లోక్‌సభకు పోటీచేసిన వారందరిలో కెల్లా అత్యంత ధనవంతుడు.[9]
సంవత్సరం | కార్యాలయం | నియోజక వర్గం | పార్టీ | ఓట్లు | % | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | % | ఫలితం | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2004 | లోక్‌సభ | ఖమ్మం | తెలుగుదేశం పార్టీ | 409,159 | రేణుకా చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | 518,047 | ఓటమి[10] | ||||
2009 | 469,368 | 344,920 | గెలుపు[11] | |||||||||
2014 | 410,230 | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 422,434 | ఓటమి[12] | |||||||
2018 | తెలంగాణ శాసనసభ | ఖమ్మం | 91,769 | పువ్వాడ అజయ్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర సమితి | 102,760 | ఓటమి | |||||
2019[13] | లోక్‌సభ | ఖమ్మం | తెలంగాణ రాష్ట్ర సమితి | 567,459 | రేణుకా చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | 399,397 | గెలుపు |
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)