నారా లోకేష్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | బొత్స సత్యనారాయణ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | ఆళ్ల రామకృష్ణారెడ్డి | ||
నియోజకవర్గం | మంగళగిరి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
ముందు | గుడివాడ అమర్‌నాథ్ | ||
పదవీ కాలం 2 ఏప్రిల్ 2017 – 29 మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | పల్లె రఘునాథరెడ్డి | ||
తరువాత | మేకపాటి గౌతమ్ రెడ్డి | ||
పదవీ కాలం 2 ఏప్రిల్ 2017 – 29 మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | కింజరాపు అచ్చెన్నాయుడు | ||
తరువాత | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | ||
పదవీ కాలం 28 మార్చ్ 2017 – 29 మార్చ్ 2023 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యాడు | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 (serving along with కె. రామ్మోహన నాయుడు) | |||
ముందు | స్థానం స్థాపించబడింది | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణ, భారతదేశం) | 23 జనవరి 1983||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నారా చంద్రబాబునాయుడు నారా భువనేశ్వరి | ||
జీవిత భాగస్వామి | నారా బ్రాహ్మణి | ||
సంతానం | నారా దేవాన్ష్ [2] | ||
నివాసం | హైదరాబాద్ విజయవాడ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం (బీఎస్సీ) స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎంబీఏ) | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
నారా లోకేశ్ (జననం 1983 జనవరి 23) భారతీయ రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "సాంకేతిక పరిజ్ఞాన, పంచయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మాజీ మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును మాజీ ముఖ్యమంత్రియు తెలుగు చలనచిత్ర నటుడును నైన నందమూరి తారక రామారావు యొక్క మనుమడు.[3] తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకమును ఆయన అభివృద్ధి చేశారు. నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి 2013 మేలో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు.[4][5]. ఇతడు హెరిటేజ్ ఫుడ్స్కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేసాడు.
నారా లోకేశ్ 1983 జనవరి 23 న జన్మించాడు. ఆయన నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల యొక్క ఏకైక కుమారుడు. ఆయన స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజిమెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీ చేసాడు.
ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. మంత్రి పదవిని చేబట్టెను. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి తన ప్రత్యర్థియు వై.కా.పా. అభ్యర్థియునైన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోకేశ్ యొక్క శాసనమండలి సభ్యత్వము 2023 మార్చి 29వ సంవత్సరము వరకునున్నది.
ఆయన ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్టు లోని హెల్త్ కేర్, విద్య యొక్క ట్రస్టీలలో ఒకరు.
లోకేష్ ట్రస్టులో ఆరోగ్యసంరక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసాడు. దీనిని పేద ప్రజలు, వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొనుటకు, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించుటకు ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం. ఆయన రక్త నిధులు (బ్లడ్ బ్యాంకులు), హెల్త్ క్యాంపులు (మొబైల్ క్లినిక్స్, నేత్ర శిబిరాలు) నిర్వహిస్తున్నాడు.
ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మంత్రిగా [6] ఎనిమిది ఐ.టి కంపెనీలను ప్రారంభించాడు.[7]
2007 లో ఇతను తన మామ అయిన నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రిక అయిన నందమూరి బ్రాహ్మణిని పెళ్ళాడెను.[8]