నిప్పు | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
రచన | ఆకుల శివ శ్రీధర్ సిపాన సంభాషణలు |
స్క్రీన్ ప్లే | గుణశేఖర్ |
కథ | గుణశేఖర్ |
నిర్మాత | వై. వి. ఎస్. చౌదరి |
తారాగణం | రవితేజ దీక్షా సేథ్ |
ఛాయాగ్రహణం | సర్వేశ్ మురారి |
కూర్పు | గౌతమ్ రాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | బొమ్మరిల్లు |
విడుదల తేదీ | 17 ఫిబ్రవరి 2012[1] |
సినిమా నిడివి | 157 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹20 crore (US$2.5 million)[2] |
బాక్సాఫీసు | ₹46 crore (US$5.8 million) |
నిప్పు[3]lang-te (help·info) 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దర్శకుడు వై. వి. ఎస్. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించాడు, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ, దీక్షా సేథ్, ప్రదీప్ రావత్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఎస్.ఎస్ తమన్[4][5] సంగీతం అందించగా సర్వేశ్ మురారి ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు.
ఓ వ్యాయామశాలను నిర్వహిస్తుంటాడు సూర్య (రవితేజ). అంతేకాదు అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళను పీక్కు తినే రౌడీల భరతం కూడా పడుతుంటాడు. ఈ క్రమంలోనే సూర్యాపేటకు చెందిన రాజా గౌడ్ (ప్రదీప్ రావత్) మనుషుల్నీ చితక్కొడతాడు. తనకంటూ ఏ లక్ష్యమూ లేని సూర్య తన స్నేహితుడు శ్రీరామ్ (శ్రీరామ్) చెల్లి మేఘన (దీక్షాసేథ్)ను ప్రేమిస్తాడు. దుబాయిలో ఉద్యోగం చేసే శ్రీరామ్‌పై హత్యానేరం మోపబడు తుంది. శ్రీరామ్ ప్రియురాలు వైష్ణవి పొరపాటున బహుళ అంతస్తుల భవంతి నుండి కింద పడిపోతుంది. దానికి శ్రీరామ్‌ను దోషిగా భావించి దుబాయ్ ప్రభుత్వం అతనికి బహిరంగ మరణదండన విధిస్తుంది. చేయని నేరానికి తన స్నేహితుడు శిక్షకు గురికావడం సూర్యను బాధిస్తుంది. వైష్ణవి తల్లిదండ్రులు క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేస్తే శ్రీరామ్ శిక్ష నుండి తప్పించుకోగలడని న్యాయస్థానం చెబుతుంది. దాంతో తన స్నేహితుడిని రక్షించడానికి నడుం బిగిస్తాడు సూర్య. తీరా వైష్ణవి తల్లిదండ్రులు ఎవరని ఆరా తీస్తే ఒకప్పుడు తనతో తగువు పడిన రాజాగౌడ్ అని తెలుస్తుంది. పరమ కిరాతకుడైన రాజాగౌడును తనదారిలోకి తెచ్చుకోవడానికి అతని ప్రత్యర్థి శంకర్ కాకాతో చేతులు కలుపుతాడు సూర్య. మరోపక్క స్నేహితుడికి పడిన ఉరిశిక్ష గురించి అతని తండ్రి మూర్తి (రాజేంద్ర ప్రసాద్)కు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. మరోవైపు తన ప్రేమను నిలబెట్టుకోవడానికి అథ్లెట్ అయిన మేఘనకు కెరీర్ పరంగా సహకారం అందించి ప్రోత్సహిస్తాడు. చివరకు తన స్నేహితుడిని ఎలా రక్షించుకున్నాడు, రాజా గౌడ్‌ను తనవైపు ఎలా తిప్పుకున్నాడు, మేఘన మనసును ఎలా గెలుచుకున్నాడు అన్నది పతాక సన్నివేశం.[8]
వేగ వేగ, రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్
నేనా నిన్ను , రచన: వనమాలి, గానం.కార్తీక్, కె ఎస్ చిత్ర
ఆలీబాబా , రచన: విశ్వా, గానం. జావేద్ అలి
ఓయ్ పిల్లా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.టిప్పు, హరిణి
దుబా దుబా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ఎస్.తమన్
ధియా ధియా , రచన: అనంత శ్రీరామ్, గానం రాహుల్ నంబియార్ , శ్రీకృష్ణ, కృష్ణచైతన్య, గీతామాధురి , దీపు , హిమబిందు , సుధ , పమిక
నిప్పు శ్లోకం , రచన: అనంత శ్రీరామ్, గానం.శ్రావణభార్గవి .