నివేదా పేతురాజ్ | |
---|---|
![]() నివేద | |
జననం | |
వృత్తి | సినీ నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2015 – ప్రస్తుతం [1] |
నివేదా పెతురాజ్ దక్షిణ భారతదేశ సినీ నటి , మోడల్. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది.[2] తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.
నివేదా పేతురాజ్ కోవిల్‌పట్టిలో జన్మించింది.[3] తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది.[4] తన చిన్న వయస్సులో ఆమె తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉంది.[5] 2015 లో మిస్ ఇండియా యుఎఇ పోటీని గెలుచుకుంది.[6]
ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత పోధువాగ ఎమ్మనసు తంగం(2017), టిక్ టిక్ టిక్ విడుదలయ్యాయి. స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపద్యములో వచ్చిన టిక్ టిక్ టిక్ చిత్రానికిగాను ఆమె విమర్శకుల ప్రశంసలను పొందింది.[7][8]
విజయ్ చందర్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చిత్రానికి ఆమె సంతకం చేసింది. [9]
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2016 | ఓరు నాల్ కూతు | కావ్య | తమిళ | తొలి తమిళ చిత్రం | |
2017 | పొదువగా ఎన్ మనసు తంగం | లీలావతి | తమిళ | ||
మెంటల్ మదిలో | స్వేచ్చ | తెలుగు | తొలి తెలుగు చిత్రం | ||
2018 | టిక్ టిక్ టిక్ | లెఫ్టినెంట్ ఎం. స్వాతి | తమిళ | ||
తిమిరు పుడిచావన్ | SI మడోన్నా | తమిళ | |||
2019 | చిత్రలహరి | కె. స్వేచ్ఛ | తెలుగు | ||
బ్రోచేవారెవరురా | శాలిని | తెలుగు | |||
సంగతమిజాన్ | తేన్మొళి "తేను" | తమిళ | |||
2020 | అల వైకుంఠపురములో | నందిని "నందు" | తెలుగు | ||
2021 | రెడ్ | ఎస్‌ఐ యామిని | తెలుగు | ||
పాగల్ | తీరా | తెలుగు | |||
పొన్ మాణిక్కవేల్ | అన్బరసి మాణిక్కవేల్ | తమిళ | |||
2022 | బ్లడీ మేరీ | మేరీ | తెలుగు | [10] | |
విరాట పర్వం | డా. సరళ / సరళక్క | తెలుగు | అతిధి పాత్ర | [11] | |
2023 | దాస్ కా ధమ్కీ | కీర్తి | తెలుగు | ||
బూ | వానతి | తమిళ | |||
TBA | పార్టీ | కల్కి | తమిళ | విడుదల కాలేదు |
సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | భాష | మూ |
---|---|---|---|---|---|
2023 | కాలా | సితార "తార" | డిస్నీ+ హాట్‌స్టార్ | హిందీ | [12] |
2024–ప్రస్తుతం | పరువు | పల్లవి "డాలీ" | జీ5 | తెలుగు | [13] |
సంవత్సరం | అవార్డు | వర్గం | పని | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
2018 | 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు | మెంటల్ మదిలో | నామినేట్ చేయబడింది | [14] |
జీ తెలుగు అప్సర అవార్డులు | సంవత్సరానికి తాజా ముఖం | గెలిచింది | [15] | ||
2021 | 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటి - తెలుగు | చిత్రలహరి | నామినేట్ చేయబడింది | [16] |
2022 | 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | రెడ్ | నామినేట్ చేయబడింది | [17] |