![]() | |||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||||||||||||||
జననం | హిమాచల్ ప్రదేశ్ | 3 అక్టోబరు 1999||||||||||||||
క్రీడ | |||||||||||||||
క్రీడ | పారా-అథ్లెటిక్స్ | ||||||||||||||
పోటీ(లు) | హై జంప్ | ||||||||||||||
మెడల్ రికార్డు
|
నిషద్ కుమార్ (జననం 1999 అక్టోబరు 3) భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు. ఇతను 2020 వేసవి పారాలింపిక్స్లో భారత్ తరఫున ఆడి 2.06 మీటర్ల హై జంప్ చేసి ఆసియా రికార్డు సృష్టించి, రజత పతకం సాధించాడు.[1][2][3]
నిషద్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉన గ్రామంలో జన్మించాడు. తన ఎనిమిదవ ఏట జరిగిన ఆక్సిడెంట్లో కుడి చేయిని కోల్పోయాడు.
2021 సంవత్సరం మొదట్లో కోవిడ్ బారిన పడ్డాడు. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుండి తన ఉన్నత చదువుని కొనసాగించాడు.
2009 నుండి పారా-అథ్లెటిక్స్ క్రీడల శిక్షణ తీసుకోవటం మొదలెట్టాడు. 2019 ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో T47 విభాగంలో కాంస్య పతకం గెలిచి, 2020 టోక్యో పారాలింపిక్స్కి అర్హత సాధించాడు.
2020 వేసవి పారాలింపిక్స్లో భావీనా పటేల్ తరువాత భారత్ కు 2వ పతకం సాధించిన క్రీడాకారునిగా నిలిచాడు. T47 విభాగంలో 2.06 మీటర్ల ఎత్తును దుంకి రజత పతకం సాధించాడు.