![]() కక్ష్యలో నిసార్ - చిత్రకారుని ఊహ | |
పేర్లు | నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ నిసార్ |
---|---|
మిషన్ రకం | రాడార్ ఇమేజింగ్ |
ఆపరేటర్ | నాసా / ఇస్రో |
వెబ్ సైట్ | |
మిషన్ వ్యవధి | 3 సంవత్సరాలు (ప్రణాళిక) [1][2] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
అంతరిక్ష నౌక | నిసార్ |
బస్ | I-3K[3] |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 2,800 kగ్రా. (99,000 oz) [4] |
శక్తి | 6,500 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 2024 (planned)[5][6] |
రాకెట్ | జిఎస్ఎల్వి ఎమ్‌కె2 (4 మీటర్ల ఫెయిరింగుతో) [3] |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | భూకేంద్రిత కక్ష్య[1] |
రెజిమ్ | సౌర సమన్వయ కక్ష్య[7] |
Perigee altitude | 747 kమీ. (2,451,000 అ.) |
Apogee altitude | 747 kమీ. (2,451,000 అ.) |
వాలు | 98.5° |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | S-band L-band |
Instruments | |
L-band (24-cm wavelength) Polarimetric Synthetic Aperture Radar S-band (12-cm wavelength) Polarimetric Synthetic Aperture Radar | |
![]() నిసార్ లోగో |
నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చరు రాడార్ (NISAR) మిషన్ ద్వంద్వ-పౌనఃపున్యం కలిగిన సింథటిక్ ఎపర్చరు రాడార్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, దాన్ని భూ పరిశీలన ఉపగ్రహంపై ఉంచి అంతరిక్షం లోకి ప్రయోగించడానికీ నాసా ఇస్రోలు ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు. ద్వంద్వ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించే మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈ ఉపగ్రహం గుర్తింపు పొందుతుంది. ఇది రిమోట్ సెన్సింగ్ కోసం, భూమిపై సహజ ప్రక్రియలను గమనించడానికీ, అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, దాని ఎడమవైపు ఉండే సాధనాలు అంటార్కిటిక్ క్రయోస్పియర్‌ను అధ్యయనం చేస్తాయి. US$1.5 బిలియన్ల మొత్తం వ్యయమయ్యే నిసార్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలక ఉపగ్రహం అవుతుంది. [8]
నిసార్ ఉపగ్రహం, అధునాతనమైన రాడార్ ఇమేజింగ్‌ను ఉపయోగించి భూమి పైని నేల, మంచుల ఎత్తును 5 నుండి 10 మీటర్ల రిజల్యూషన్‌లో కొలుస్తుంది. నెలకు 4 నుండి 6 సార్లు ఇది కొలుస్తుంది. [9] పర్యావరణ వ్యవస్థ లోని అవాంతరాలు, మంచు పలకల పతనం, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సహజ ప్రమాదాలతో సహా గ్రహపు అత్యంత సంక్లిష్టమైన సహజ ప్రక్రియలలో కొన్నింటిని పరిశీలించడానికి, కొలవడానికీ దీన్ని రూపొందించారు. [10] [11]
ఒప్పందం లోని నిబంధనల ప్రకారం, మిషన్ లోని L-బ్యాండ్ సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR), శాస్త్రీయ డేటా GPS రిసీవర్‌ల కోసం అధిక-రేటు టెలికమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, సాలిడ్-స్టేట్ రికార్డర్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా అందిస్తుంది. ఇస్రో, శాటిలైట్ బస్, ఎస్-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్, వాహక నౌక, అనుబంధ ప్రయోగ సేవలను అందిస్తుంది. [12]
నిసార్ నుండి డేటా అంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మామూలు రోజుల్లో 1 నుండి 2 రోజుల తర్వాత ఈ డేటా అందుబాటు లోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితుల్లో గంటల వ్యవధిలోనే అందిస్తారు. [13]
ఉపగ్రహం మూడు-అక్షాల స్థిరీకరణలో ఉంటుంది. ఇది 12 మీ. (39 అ.) మెష్ యాంటెన్నాను ఉపయోగిస్తుంది. L- S- మైక్రోవేవ్ బ్యాండ్‌లు రెండింటిలోనూ ఇది పనిచేస్తుంది. [14] ఎపర్చరు మెష్ రిఫ్లెక్టర్ (యాంటెన్నా)ని నార్త్‌రోప్ గ్రుమ్మాన్ కు చెందిన ఆస్ట్రో ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. [15]
ఈ ఉపగ్రహాన్ని 2024లో భారతదేశం నుండి GSLV Mk II ద్వారా ప్రయోగిస్తారు. ఇది సూర్య-సమవర్తన కక్ష్యలో పరిభ్రమిస్తుంది. మిషన్ జీవితకాల అంచనా మూడు సంవత్సరాలు. ప్రాజెక్ట్ డిజైన్ ధ్రువీకరణ దశలో మొదటి అంగను దాటింది. నాసా దీన్ని సమీక్షించి, ఆమోదించింది. [16]
ప్రాజెక్టు వ్యయంలో ఇస్రో వాటా సుమారు ₹788 crore (US$99 million) కాగా, నాసా వాటా సుమారు US$808 మిలియన్లు. [17] [18]
{{cite web}}
: CS1 maint: date format (link)
{{cite web}}
: CS1 maint: date format (link)