మొహమ్మద్ నిస్సార్ ట్రోఫీ అనేది సెప్టెంబరులో జరిగే వార్షిక ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీ. రంజీ ట్రోఫీ (భారతదేశం), క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీ (పాకిస్థాన్)లో ఇటీవలి విజేతల మధ్య నాలుగు రోజుల పాటు పోటీ జరిగింది.[1] ఈ ట్రోఫీకి దేశవిభజనకు ముందు భారత్ తరఫున టెస్టులాడిన క్రికెటరు మొహమ్మద్ నిస్సార్ పేరు పెట్టారు.
2006లో ప్రారంభమైన ఈ వార్షిక పోటీ భారత పాకిస్తాన్లలో మార్చి మార్చి జరుగుతుంది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్, సియాల్‌కోట్‌ను ఓడించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తర్వాతి సీజన్‌లో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో ముంబై, కరాచీ అర్బన్‌తో తలపడి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ట్రోఫీ సాధించింది. 2008లో ఢిల్లీలో, సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్ లిమిటెడ్ జట్టు ఢిల్లీని మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఓడించింది. ట్రోఫీని గెలుచుకున్న మొదటి పాకిస్తాన్ జట్టుగా అవతరించింది.[2][3][4]
బుతువు | విజేత | ప్రత్యర్థి | మార్జిన్ | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ | స్టేడియం |
---|---|---|---|---|---|
2006 | ఉత్తర ప్రదేశ్ | సియాల్కోట్ | 316 పరుగుల తేడాతో | రిజ్వాన్ శంషాద్ | HPCA స్టేడియం, ధర్మశాల, భారతదేశం |
2007 | ముంబై | కరాచీ అర్బన్ | వారి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో (మ్యాచ్ డ్రా) | ఖుర్రం మంజూర్ | నేషనల్ స్టేడియం, కరాచీ, పాకిస్థాన్ |
2008 | సుయి నార్దర్న్ గ్యాస్ పైప్లైన్స్ | ఢిల్లీ | వారి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో (మ్యాచ్ డ్రా) | విరాట్ కోహ్లీ | ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ, భారతదేశం |