నీతా లుల్లా | |
---|---|
![]() 2012లో నీతా లుల్లా | |
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 5 మార్చి 1965
వృత్తి |
|
Label(s) | నీతా లుల్లా ఫ్యాషన్స్ |
జీవిత భాగస్వామి | శ్యామ్ లుల్లా |
పిల్లలు | 2[1] |
పురస్కారాలు | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ |
నీతా లుల్లా (జననం 1965 మార్చి 5) భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్. ఆమె 300 చిత్రాలకు పైగా పని చేసింది. ఆమె 1985 నుండి వివాహ దుస్తులను డిజైన్ చేస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఖుదా గవా, దేవదాస్‌లో చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంతో ఆమె ప్రసిద్ధి చెందింది.
లమ్హే (1990), దేవదాస్ (2002), జోధా అక్బర్ (2002), బాలగంధర్వ (2010) చిత్రాలకు రూపకల్పన చేసిన ఆమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందింది.
నటీమణులు సల్మా ఆఘా, శ్రీదేవి లకు కాస్ట్యూమ్ డిజైన్‌లతో ఆమె ప్రసిద్ధిచెందింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల వివాహ సమయంలో ఆమె డిజైన్ చేసిన దుస్తులు నీతా లుల్లా కెరీర్‌ను మలుపుతిప్పాయి. తన ఫేవరెట్ నటి దివ్యభారతితో పాటు బాలీవుడ్ లో శిల్పాశెట్టి, సప్నా, సల్మా ఆజాద్, ఇషా కొప్పికర్, జుహీ చావ్లా మరెందరో అగ్రశ్రేణి నటీమణులకు ఆమె డిజైన్ చేసింది.
మొహెంజో దారో (2016) వంటి చిత్రాలకు రూపకల్పన చేసేన ఆమె[2] గౌతమీపుత్ర శాతకర్ణితో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టింది.[3]
ముంబైకి చెందిన నీతా లుల్లా గణనీయమైన సమయాన్ని నగరంలోని ఫిల్మ్‌సిటీలో గడిపింది.[4] ఆమె సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ లుల్లాను వివాహం చేసుకుంది.[5]
Year | Film | Result |
1991 | లమ్హే | విజేత |
2002 | దేవదాస్ | విజేత |
2008 | జోధా అక్బర్ | విజేత |
2011 | బాలగంధర్వ | విజేత |
Year | Film | Result | Ref. |
2003 | దేవదాస్ | నామినేటెడ్ | [7] |
2009 | జోధా అక్బర్ | నామినేటెడ్ | [8] |
Year | Film | Result | Ref. |
2001 | మిషన్ కాశ్మీర్ | విజేత | |
2003 | దేవదాస్ | విజేత |
Year | Film | Result | Ref. |
2000 | తాల్ | విజేత | |
2009 | జోధా అక్బర్ | విజేత |
Year | Film | Result | Ref. |
2002 | దేవదాస్ | విజేత |