నీలేష్ నారాయణ్ రాణే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం నవంబర్ 23 | |||
ముందు | వైభవ్ నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కుడాల్ | ||
పదవీ కాలం 2009 - 2014 | |||
తరువాత | వినాయక్ రౌత్ | ||
నియోజకవర్గం | రత్నగిరి-సింధుదుర్గ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1981 మార్చి 17||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన (2024-ప్రస్తుతం)
| ||
తల్లిదండ్రులు | నారాయణ్ రాణే, నీలిమ | ||
జీవిత భాగస్వామి | ప్రియాంక రాణే (m. 2007) | ||
బంధువులు | నితేష్ రాణే (సోదరుడు) | ||
సంతానం | అభిరాజ్ రాణే | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నీలేష్ నారాయణ్ రాణే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 ఎన్నికలలో కుడాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
నీలేష్ రాణే తన తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి & మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009 లోక్‍సభ ఎన్నికలలో రత్నగిరి-సింధుదుర్గ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సురేష్ ప్రభుపై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 లోక్‍సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి వినాయక్ రౌత్ చేతిలో1,50,051 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.
నీలేష్ రాణే 2019లో 2019 లోక్‍సభ ఎన్నికలలో రత్నగిరి-సింధుదుర్గ్ నుండి 2018లో తన తండ్రి స్థాపించిన మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి అనంతరం అక్టోబర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] నీలేష్ నారాయణ్ రాణే 2024 ఎన్నికలకు ముందు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరి,[3][4] కుడాల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి వైభవ్ నాయక్ పై 8176 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]