నెక్లెస్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ను ఆనుకొని ఉన్న రోడ్డు. ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు మధ్యలో ఆ రోడ్డు ఉంది.[1] సంజీవయ్య పార్కు నుండి ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్కు మీదుగా ట్యాంక్‌బండ్ రోడ్డును, ఈ నెక్లెస్ రోడ్డు కలుపుతోంది. 2021, మే 30న తెలంగాణ ప్రభుత్వం ఈ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చింది.[2]
హుస్సేన్ సాగర్ ను పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీలో భాగంగా 1996లో హుస్సేన్ సాగర్ సరస్సుకు పశ్చిమం వైపు 3.6 కిలోమీటర్ల పొడవుతో నెక్లెస్ రోడ్డును నిర్మించారు.
ట్యాంక్ బండ్ చుట్టూ దానికి మణిహారంలా ఉండే రోడ్డును నెక్లెస్ రోడ్డు అంటారు. ఆకాశం నుండి చూసినప్పుడు, ఈ రోడ్డు ఒక నెక్లెస్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి నెక్లెస్ రోడ్డు అని పేరు పెట్టారు.[3]
ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు, క్రీడలు, ఇతర ఆటలకోసం ఈ ప్రాంతంలో పీపుల్స్ ప్లాజా ఉంది. ఇక్కడ ఈట్ స్ట్రీట్, వాటర్ ఫ్రంట్ రెండు పేరొందిన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో బఫేలు, వివిధ రకాల వంటకాలు ఉంటాయి. ఈ రెస్టారెంట్ల నుండి హుస్సెన్ సాగర్ దృశ్యాలు కనిపిస్తాయి.[4]
ఇక్కడ జోగి బేర్ పార్కు, సంజీవయ్య పార్కు, జలవిహార్ ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే జాగింగ్ చేయడానికి, మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, సాయంత్రం హ్యాంగ్ఔట్‌ల వంటివి తరచూ జరుగుతుంటాయి. నెక్లెస్ రోడ్ ఎంఎంటిఎస్ స్టేషను కూడా ఉంది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు తొందరగా వెళ్ళడానికి ఈ రోడ్డు దగ్గరి మార్గం.
ఇక్కడ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను ఉంది.
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)