మైనారిటీల భద్రత, హక్కులపై భారత పాకిస్తాన్ ప్రభుత్వాల ఒప్పందం | |
---|---|
రకం | హక్కుల పరిరక్షణపై పరస్పర అవగాహన |
సందర్భం | భారతదేశ విభజన[1] |
రాసిన తేదీ | 1950 ఏప్రిల్ 2 |
సంతకించిన తేదీ | 8 ఏప్రిల్ 1950 |
స్థలం | న్యూ ఢిల్లీ |
స్థితి | ఇరుపక్షాల అనుమోదం |
కాలపరిమితి | 8 ఏప్రిల్ 1956 |
మధ్యవర్తులు | ఇరుదేశాల మానవ హక్కుల మంత్రిత్వ శాఖలు |
చర్చల్లో పాల్గొన్నవారు | ఇరుదేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు |
సంతకీయులు |
|
కక్షిదారులు | |
ఆమోదకులు | |
Depositaries | ఇరుదేశాల ప్రభుత్వాలు |
భాషలు |
లియాఖత్-నెహ్రూ ఒప్పందం (లేదా ఢిల్లీ ఒడంబడిక), భారత పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం. దేశ విభజన నాటి శరణార్థులు తమ ఆస్తులను అమ్ముకునేందుకు తిరిగి రావడానికి అనుమతించడం, [2], అపహరణకు గురైన స్త్రీలను, దోచుకున్న ఆస్తులను వెనక్కి అప్పగించడం, బలవంతపు మతమార్పిడులను గుర్తించకపోవడం, మైనారిటీ హక్కులను నిర్ధారించడం ఈ ఒప్పందంలో భాగాలు.
ఈ ఒప్పందంపై 1950 ఏప్రిల్ 8 న భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ లు న్యూఢిల్లీలో సంతకాలు చేశారు.[3] భారతదేశ విభజన తర్వాత ఇరు దేశాల్లోని మైనారిటీల హక్కులకు హామీ ఇవ్వడానికి, వారి మధ్య మరో యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తూ ఆరు రోజుల పాటు జరిపిన చర్చల ఫలితమే ఈ ఒప్పందం.
ఈ ఒప్పందం శరణార్థుల కోసం వీసా విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. సరిహద్దు మీదుగా శరణార్థులు స్వేచ్ఛగా రాకపోకలు జరపడాన్ని నిరోధించింది.
రెండు దేశాల్లోనూ మైనారిటీ కమిషన్లు ఏర్పాటయ్యాయి. పది లక్షల పైచిలుకు శరణార్థులు తూర్పు పాకిస్తాన్ (ఇప్పుటి బంగ్లాదేశ్) నుండి భారతదేశం లోని పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చారు.