నేరేడుచర్ల మండలం

నేరేడుచర్ల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°55′55″N 79°40′07″E / 16.932019°N 79.668503°E / 16.932019; 79.668503
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం నేరేడుచర్ల
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,499
 - పురుషులు 33,388
 - స్త్రీలు 33,111
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.73%
 - పురుషులు 71.50%
 - స్త్రీలు 47.45%
పిన్‌కోడ్ 508218


నేరేడుచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] నేరేడుచర్ల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మిర్యాలగూడ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

నల్గొండ జిల్లా నుండి మార్పు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ నేరేడుచర్ల మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నేరేడుచర్ల మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,కొదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 66,499 - పురుషులు 33,388 - స్త్రీలు 33,111. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 127 చ.కి.మీ. కాగా, జనాభా 41,047. జనాభాలో పురుషులు 20,610 కాగా, స్త్రీల సంఖ్య 20,437. మండలంలో 11,220 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నేరేడుచర్ల
  2. జనలదిన్నె
  3. బోదలదిన్నె
  4. పెంచికలదిన్నె
  5. కాల్వలదిన్నె
  6. చిల్లేపల్లి
  7. దిరిసెనచర్ల
  8. సోమవరం
  9. దాచారం
  10. ఎల్లారం
  11. ఫతేపురం
  12. కల్లూరు
  13. మేడారం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]