Pueraria tuberosa | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | P. tuberosa
|
Binomial name | |
Pueraria tuberosa | |
Synonyms[1] | |
|
నేల గుమ్మడి అడవిలో దొరికే ఒక ఔషధ మొక్క. ఫాబేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ప్యురేరియా ట్యూబరోసా (Pueraria Tuberosa), సంస్కృతలో ఈ మొక్కను విదారి కంద, స్వాధు కంద, ఇసుగంధ, భూమి కూష్మాంఢ అనే పేర్లతో పిలుస్తారు. ఆంగ్ల పరిభాషలో ఈ మొక్కను ఇండియన్ కుడ్జు అని అంటారు. కొన్ని గిరిజన గ్రామాల్లో నేలగుమ్మడిని దారి గుమ్మడి అని కూడా అంటారు. హిందీలో బిలై కంద అని, కన్నడలో నేల గుంభాల అని, మలయాళంలో ముతక్కు అని, తమిళంలో నిలా పూసాని అని పిలుస్తారు.
ఈ మొక్క భారత దేశంలో ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు, ఈశాన్య రాష్ట్రాల అడవుల్లోను, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లోను కనిపిస్తుంది.
ఇది తీగమొక్కలా పెరుగుతుంది.
నేలగుమ్మడి మొక్కలో ప్రధానంగా ఉపయోగించే నేలగుమ్మడి అనే భాగం దుంప రూపం. ఇది గుమ్మడి కాయలా వుండటంతో నేలలో పెరిగే గుమ్మడి అనుకుని దానికాపేరు పెట్టి వుంటారు.
నేలగుమ్మడి కాయ రుచి తియ్యగా వుంటుంది.
నేలగుమ్మడిని పొడిగా, లేహ్యంగా, రసంగా, కషాయంగా, చ్యవనప్రాశ్ గానూ తయారుచేసుకుని వాడతారు.
నిస్సత్తువ నుండి ఉపశమనం పొందడానికి ఉడికించిన విదారికంద వేళ్లను రోజుకు 2 సార్లు చొప్పున 3 వారాలు తింటారు.[3]
అక్రమ చొరబాటుదారుల వల్ల ప్రస్తుతానికి ఈ నేలగుమ్మడి జాతి అంతరించిపోయే దశలో ఉంది.