NIC ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1976 లో స్థాపించబడింది.[6] 1990లలో భారత ప్రభుత్వానికి సమాచార సాంకేతికతను అందిచడం కోసం ఈ సంస్థ కృషి చేసింది.[7] ఇ-గవర్నెన్స్ ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియచెప్పడం కూడా ఈ సంస్థ చేస్తున్న పనులలో ఒకటి.[8]
దీని వార్షిక బడ్జెట్ (2018–19 సంవత్సరానికి) 1150 కోట్ల రూపాయలు.[9]
NIC ను 1976లో భారత ప్రభుత్వ ప్రణాళికా సంఘం స్థాపించినప్పుడు, అప్పట్లో అదనపు కార్యదర్శి దివంగత డాక్టర్ ఎన్. శేషగిరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా "నిక్నెట్" (NICNET) అనే నెట్‌వర్క్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.[10]నిక్నెట్ 1990 లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో , కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశ జిల్లా పరిపాలనల మంత్రిత్వ శాఖలు / విభాగాలతో సంస్థాగత సంబంధాలను సులభతరం చేసింది[10]
NIC ఇ-గవర్నెన్స్ కు సంబంధించిన అనేక సదుపాయాలను, అప్లికేషన్లను అందుబాటులోనికి తెచ్చింది.[11]
NIC కొత్త ఢిల్లీ, హైదరాబాదు, పూనా, భువనేశ్వర్ లలో నాలుగు ప్రధాన డేటా సెంటర్లను నిర్వహిస్తుంది. 2018 లో భువనేశ్వర్ లో ప్రారంభమైన డేటా సెంటర్ అన్నింటిలోనూ నూతనమైనది. ఇవి కాకుండా 36 స్టేట్ సెంటర్లను అన్ని రాష్త్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తుంది.[12][5] దీనికి 708 జిల్లా కార్యాలయాలు అనుబంధంగా ఉన్నాయి.[5]
NIC India.gov.in భారత దేశ జాతీయ పోర్టల్ ను నిర్వహిస్తుంది. ఈ పోర్టల్‌లో భారత రాజ్యాంగం, ఇతర భారత ప్రభుత్వ సమాచారం, ప్రభుత్వ సేవలను పొందటానికి కావల్సిన ఏకగవాక్ష (సింగిల్ విండో) సదుపాయాలు లభ్యం అవుతాయి.
↑"Wayback Machine"(PDF). web.archive.org. 2019-11-05. Archived from the original on 2019-11-05. Retrieved 2020-04-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
↑ 10.010.1M.R., Bhagavan (1997). New Generic Technologies in Developing Countries. London & New York:: Macmillan & St. Martin. ISBN978-0-333-65049-3.{{cite book}}: CS1 maint: extra punctuation (link)