ఈ article ప్రాథమిక స్థాయి మూలాలపై మరీ ఎక్కువగా ఆధారపడి ఉంది. (March 2021) |
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 1986 |
బడ్జెట్ | ₹120 crore (US$15 million) (FY2022–23 est.)[1] |
విద్యార్థులు | 11,514[2] |
స్థానం | 23°06′46″N 72°22′28″E / 23.1128°N 72.3745°E |
కాంపస్ | పట్టణం |
అనుబంధాలు | మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, భారత ప్రభుత్వం |
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఆంగ్లం: National Institute of Fashion Technology) అనేది ఫ్యాషన్, డిజైనింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ లలో కోర్సులను అందించే స్వయంప్రతిపత్తిగల సంస్థ.[3] దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఉంది.[4]
2022లో భారత సైన్యం ఎంపికచేసుకున్న కొత్త డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ యూనిఫాం ఈ సంస్థచే రూపొందించబడింది.[5]
దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్‌లలో ప్రతీయేటా యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలోఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.[6]
1986లో నిఫ్ట్ భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది. ఇది 2006లో చట్టబద్ధమైన సంస్థగా ప్రకటించబడింది. భారత పార్లమెంట్ నిఫ్ట్ చట్టం ద్వారా దాని స్వంత డిగ్రీని మంజూరు చేయడానికి అధికారం పొందింది. టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖతో పాటు, నిఫ్ట్ భారతదేశ నిర్దిష్ట పరిమాణ చార్ట్‌ను రూపొందించే ప్రక్రియను 2021 కల్లా పూర్తి చేసేలా మొదలైంది.[7] నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT2022 ఫలితాన్ని 2022 మార్చి 9న ఆన్‌లైన్ మోడ్‌లో ప్రకటించింది.[8]
నిఫ్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 క్యాంపస్‌లను కలిగి ఉంది. మొదటి క్యాంపస్ 1986లో న్యూ ఢిల్లీలోని హౌస్ ఖాజ్‌లో స్థాపించబడింది. చెన్నై, కోల్‌కతా, గాంధీనగర్, హైదరాబాద్, ముంబైలలో క్యాంపస్‌లు 1995లో స్థాపించబడ్డాయి. ఆ తర్వాత బెంగళూరు క్యాంపస్ 1997లో స్థాపించబడింది.[9] భోపాల్‌లోని క్యాంపస్‌ను 2008 జూన్లో, భువనేశ్వర్‌లో 2010లో[10], జోధ్‌పూర్‌లో 2010లో[11], కాంగ్రాలో 2009లో[12] క్యాంపస్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. 2007లో రాయ్‌బరేలి, 2008లో పాట్నా[13], కన్నూర్, షిల్లాంగ్, 2016లో శ్రీనగర్[14], 2019లో పంచకుల క్యాంపస్ లు ప్రారంభం అవగా తాజాగా 2022లో డామన్లో స్థాపించారు.[15]
నిఫ్ట్ డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఇవే కాకుండా నిరంతర విద్యా కార్యక్రమాలు జరుగుతుంటాయి.[16][17] నిఫ్ట్ అందించే ప్రోగ్రామ్‌ల జాబితా..
బహుళ కార్యక్రమాలు
# | Name of the Centre | City | State | Established | Website |
1 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ | న్యూఢిల్లీ | ఢిల్లీ | 1986 | nift.ac.in/delhi/ |
2 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, చెన్నై | చెన్నై | తమిళనాడు | 1995 | nift.ac.in/chennai/ |
3 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, గాంధీనగర్ | గాంధీనగర్ | గుజరాత్ | 1995 | nift.ac.in/gandhinagar/ |
4 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ | హైదరాబాద్ | తెలంగాణ | 1995 | nift.ac.in/hyderabad/ |
5 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, కోల్‌కతా | కోల్‌కతా | పశ్చిమ బెంగాల్ | 1995 | nift.ac.in/kolkata/ |
6 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ముంబై | ముంబై | మహారాష్ట్ర | 1995 | nift.ac.in/mumbai/ |
7 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బెంగళూరు | బెంగళూరు | కర్ణాటక | 1996 | nift.ac.in/bengaluru/ |
8 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రాయ్‌బరేలి | రాయబరేలి | ఉత్తర ప్రదేశ్ | 2007 | nift.ac.in/raebareli/ |
9 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, భోపాల్ | భోపాల్ | మధ్యప్రదేశ్ | 2008 | nift.ac.in/bhopal/ |
10 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, కన్నూర్ | కన్నూర్ | కేరళ | 2008 | nift.ac.in/kannur/ |
11 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, షిల్లాంగ్ | షిల్లాంగ్ | మేఘాలయ | 2008 | nift.ac.in/shillong/ |
12 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పాట్నా | పాట్నా | బీహార్ | 2008 | nift.ac.in/patna/ |
13 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, కాంగ్రా | కాంగ్రా | హిమాచల్ ప్రదేశ్ | 2009 | nift.ac.in/kangra/ |
14 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, భువనేశ్వర్ | భువనేశ్వర్ | ఒడిశా | 2010 | nift.ac.in/bhubaneswar/ |
15 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, జోధ్‌పూర్ | జోధ్‌పూర్ | రాజస్థాన్ | 2010 | nift.ac.in/jodhpur/ |
16 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, శ్రీనగర్ | శ్రీనగర్ | జమ్మూ కాశ్మీర్ | 2013 | nift.ac.in/srinagar/ |
17 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పంచకుల | పంచకుల | హర్యానా | 2019 | nift.ac.in/panchkula/ |
18 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, డామన్ | డామన్ | దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | 2022 | nift.ac.in/daman/ |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)