నోమితా చాందీ

నోమితా చాందీ
జననం1946 ఆగస్టు 21[ఆధారం చూపాలి]
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
మరణం2015 మే 24
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తిసామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిమోహన్ చాందీ
పిల్లలు2
పురస్కారాలుపద్మశ్రీ

నోమితా చాందీ బెంగుళూరుకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, నిరాశ్రయులైన పిల్లల పునరావాసం కోసం ఆమె చేసిన సేవలకు ప్రసిద్ధి చెందింది.

ఆమె లవెడాలే లోని లారెన్స్ స్కూల్లో చదివింది.[1]

ఆమె ఆశ్రయా అనే ప్రభుత్వేతర సంస్థకు వ్యవస్థాపకురాలు, కార్యదర్శి. ఆమె ప్రధానంగా నిరాశ్రయులైన పిల్లల పునరావాసం కోసం పనిచేస్తున్నది.[2][3] ఆ సంస్థ ఆధ్వర్యంలో చాండీ, ఆమె సహచరులు దేశంలో 2000 మంది పిల్లలను, బయట 1000 మంది పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడంలో విజయవంతమయ్యారు.[4] ఈ సంస్థ నీల్‌భాగ్ అనే పాఠశాలను, వలస కార్మికుల పిల్లల కోసం సురక్షితమైన క్రేచ్ నూ కూడా నడుపుతుంది. అలాగే పిల్లల సంరక్షణ కేంద్రంలో ఎనిమిది మంది దృష్టి లోపం ఉన్న పిల్లలను చూసుకుంటుంది.[5] భారత ప్రభుత్వం 2011లో నోమితా చాందీని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[6]

చాందీ 2015 మే నెలలో బెంగళూరులో మరణించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Narayanan, Chitra (16 April 2011). "Bonding for a lifetime". The Hindu Businessline. Retrieved 9 April 2023.
  2. "Ashraya Home". Ashraya. 2014. Retrieved 19 November 2014.
  3. "Ashraya about". Ashraya. 2014. Retrieved 19 November 2014.
  4. "TOI". TOI. 14 December 2011. Retrieved 19 November 2014.
  5. "The Hindu". The Hindu. 19 March 2011. Retrieved 19 November 2014.
  6. "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 11 November 2014.
  7. Menon, Parvathi (6 June 2015). "Champion for the abandoned". Retrieved 30 May 2018.

బాహ్య లింకులు

[మార్చు]
  • "Nomita Chandy". Video. YouTube. 14 April 2013. Retrieved 19 November 2014.