క్రికెట్ సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1997 ఏప్రిల్ 27 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 జూలై 18 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93 - 2001/02 | హైదరాబాదు క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్కిక్ ఇన్ఫో, 2006 మార్చి 6 |
నోయెల్ ఆర్థర్ డేవిడ్ (జననం 26 ఫిబ్రవరి 1971) భారత మాజీ క్రికెటర్. హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున దేశీయ క్రికెట్ ఆడాడు. 1997లో భారతదేశం తరపున 4 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడాడు.
నోయెల్ 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని కుటుంబం పుదుచ్చేరి నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడింది. తన తోబుట్టువులలో ఒకరు (అన్నయ్య) ఇప్పటికీ పుదుచ్చేరిలోనే నివసిస్తున్నాడు. నోయెల్ హైదరాబాదులోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో చదివాడు. ఇక్కడ అబిద్ అలీ, సయ్యద్ కిర్మాణీ, ముహమ్మద్ అజహరుద్దీన్, వెంకటపతి రాజు మొదలైన టెస్ట్ ప్లేయర్స్ ఇక్కడ చదివారు. 100, 200 మీటర్ల అథ్లెట్, ఫీల్డింగ్ కోచ్ సంపత్ కుమార్ తో కలిసి అభివృద్ధి చేశాడు.[1]
నోయెల్ బౌలింగ్ ఆల్ రౌండర్, మంచి ఆఫ్ బ్రేక్ బౌలర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్. అంతేకాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ చేసేవాడు. హైదరాబాదు జట్టు రికార్డు 944 పరుగులలో నోయెల్ తన రెండవ మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేశాడు.[1][2][3]
భారత క్రికెట్ జట్టుకు నోయెల్ ఎప్పుడూ గొప్ప ఫీల్డర్ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. కరేబియన్ వ్యాఖ్యాత టోనీ కోజియర్‌తోపాటు, గవాస్కర్ నోయెల్ ను జాంటి రోడ్స్‌తో కూడా పోల్చాడు.[1] నోయెల్ 1997లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున నాలుగు వన్డేలు ఆడి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
నోయెల్ తన పదవీ విరమణ తరువాత హైదరాబాదు జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా,[4] జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా[5] పనిచేశాడు. నోయెల్ కు హైదరాబాదు జట్టుకు కోచ్ కావాలన్న కోరిక ఉండేది.[1]
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)