న్యూ కాలెడోనియాకు హిందూమతాన్ని వలస వచ్చిన భారతీయులు తీసుకువచ్చారు. వారు, ద్వీపంలోని యూరోపియన్ స్థిరనివాసుల వద్ద ఒప్పంద సేవకులుగా పనిచేశారు. భారతీయ తమిళ సంతతికి చెందిన దాదాపు 500 మంది న్యూ కాలెడోనియన్లు ఉన్నారు. వారిని మలబార్లు అని పిలిచేవారు. వాళ్ళు 19వ శతాబ్దంలో ఇతర ఫ్రెంచి భూభాగాలైన రీయూనియన్ నుండి ఇక్కడికి వచ్చారు. [1]
న్యూ కాలెడోనియాలో అనేక మంది తమిళుల వారసులు ఉన్నారు, వీరి తల్లిదండ్రులు 20వ శతాబ్దంలో స్థానిక జనాభాతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం, న్యూ కలెడోనియాకు వలస వెళ్ళిన భారతీయులు చెరకు తోటల పనిలో నైపుణ్యం కనబరచారు. అయితే అక్కడి పని పరిస్థితుల కారణంగా వారు యాజమాన్యాలకు ఎదురు తిరిగేవారు. ఆ కారణంగా అరెస్టులవడం, జైళ్ళ పాలవడం జరిగేది.[2]
భారతీయుల్లో (మలబార్లలో) కొంతమంది క్రైస్తవం లోకి మారిపోగా, కొంతమంది హిందువులు గానే ఉండిపోయారు.[3]