న్యూ ఢిల్లీ టైమ్స్ | |
---|---|
![]() న్యూ ఢిల్లీ టైమ్స్ సినిమాపోస్టర్ | |
దర్శకత్వం | రమేష్ శర్మ |
రచన | గుల్జార్ |
నిర్మాత | పి.కె. తివారీ |
తారాగణం | శశి కపూర్ షర్మిలా ఠాగూర్ ఓం పురి కుల్ భూషణ్ ఖర్బందా |
ఛాయాగ్రహణం | సుబ్రత మిత్ర |
కూర్పు | రేణు సాలుజ |
సంగీతం | లూయిస్ బ్యాంక్స్ |
పంపిణీదార్లు | పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 1986 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
భాష | హిందీ |
న్యూ ఢిల్లీ టైమ్స్ 1986లో విడుదలైన హిందీ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో పి.కె. తివారీ నిర్మించిన ఈ సినిమాకు రమేష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శశి కపూర్, షర్మిలా ఠాగూర్, ఓం పురి, కుల్ భూషణ్ ఖర్బందా ప్రధాన పాత్ర్లో నటించారు.[1] ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.
రాజకీయ అవినీతి, మీడియా గురించి వివాదాస్పద కథాంశంతో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు చలనచిత్ర పంపిణీదారులు, టెలివిజన్ రైట్స్ నిరాకరించడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఈ సినిమా మూడు (దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ) విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకుంది.[2][3] కుందన్ షా జానే భీ దో యారోన్ (1983), మెయిన్ ఆజాద్ హూన్ (1989), రాన్ (2010)[4][5] వంటి మీడియాలో అవినీతి సమస్యను పరిష్కరించే బాలీవుడ్ చిత్రాలలో ఇదీ ఒకటి.
సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత (లు) | ఫలితం |
---|---|---|---|---|
1985 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం | రమేష్ శర్మ | గెలుపు |
జాతీయ ఉత్తమ నటుడు | శశి కపూర్ | గెలుపు | ||
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ | సుబ్రత మిత్ర | గెలుపు |