వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | పంకజ్ ధర్మాని |
పుట్టిన తేదీ | ఢిల్లీ | 1974 సెప్టెంబరు 27
బ్యాటింగు | కుడిచేతి వాటం |
పాత్ర | వికెట్-కీపర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
ఏకైక వన్‌డే (క్యాప్ 100) | 1996 అక్టోబరు 23 - దక్షిణాఫ్రికా తో |
మూలం: CricInfo, 2006 మార్చి 6 |
పంకజ్ ధర్మాని, ఢిల్లీకి చెందిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు.[1] పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు.1996లో దక్షిణాఫ్రికాపై భారతదేశం తరపున ఒకేఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు.[2]
పంకజ్ 1974, సెప్టెంబరు 27న ఢిల్లీలో జన్మించాడు.[3]
పంకజ్ ధర్మాని పంజాబ్ తరఫున 1992–93 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో మహారాష్ట్రపై జరిగిన మ్యచ్ తో అరంగేట్రం చేశాడు. 1994-95 సీజన్‌లో మాత్రమే రాష్ట్ర జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బ్యాట్‌తో, స్టంప్‌ల వెనుక స్థిరమైన ప్రదర్శనల తర్వాత 1996లో టైటాన్ కప్ కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. తను ఆడిన ఒక్క మ్యాచ్ విఫలమయ్యాడు, కానీ దక్షిణాఫ్రికా పర్యటనకు బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు.[4] తనకు లభించిన పరిమిత అవకాశాలలో పెద్దగా రాణించలేకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.
పంకజ్ రాష్ట్ర రంజీ జట్టులో రెగ్యులర్‌గా కొనసాగాడు. పరుగులు చేయడంలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించడమేకాకుండా, క్రీజులో ఎక్కువ గంటలు గడిపి భారీగా స్కోర్ చేయగల స్వభావాన్ని ప్రదర్శించాడు. 1999-2000 ఫస్ట్ క్లాస్ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 1194 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలోనే 10 మ్యాచ్‌ల నుండి 70, 305 నాటౌట్, 202 నాటౌట్, 101 స్కోర్‌లతో 830 పరుగులు చేశాడు. ఇందులో ఔట్ కాకుండానే 608 పరుగులు కూడా ఉంది. పంజాబ్ 2007 రంజీ ట్రోఫీ సీజన్ ఓపెనర్‌లో ఆంధ్రతో జరిగిన పోటీలో పంకజ్ తన రాష్ట్రం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2008లో తొలిసారిగా జరిగిన ఐపిఎల్ లో అతను కింగ్స్ XI పంజాబ్ జట్టుకు ఆడాడు.