పంతం | |
---|---|
దర్శకత్వం | కె. చక్రవర్తి రెడ్డి |
రచన | కె. చక్రవర్తి రెడ్డి (కథ) బాబీ కొల్లి (స్క్రీన్ప్లే) రమేష్ రెడ్డి (సంభాషణ) |
నిర్మాత | కె. కె. రాధామోహన్ |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్ మెహ్రీన్ పిర్జాదా |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2018 జులై 5 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పంతం 2018లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటుడు తొట్టెంపూడి గోపీచంద్ నటించిన 25వ చిత్రమిది.[1]
ఒక రాష్ట్రానికి హోమ్ మంత్రి జయేంద్ర (సంపత్), ఆరోగ్య మంత్రి (జయప్రకాష్‌రెడ్డి). వారిద్దరి డబ్బును కొట్టేస్తుంటాడు ఓ వ్యక్తి (గోపీచంద్). ఓసారి మంత్రి కాన్వాయ్ నుంచి, మరోసారి రైలు బోగీ నుంచి, మరోసారి మంత్రి హవాలా చేసే డబ్బు, ఇంకోసారి మంత్రి ప్రియురాలు దగ్గర దాచిన డబ్బు ... ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాలను కొట్టేస్తుంటాడు. తమ డబ్బును కొట్టేసిన వ్యక్తి ఎవరో ఒకానొక సమయంలో జయేంద్రకు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి మామూలు వాడు కాదనీ, ప్రపంచంలోఅత్యంత ధనిక వర్గాలలో ఒకరైన సురానా పరిశ్రమల అధినేత కుమారుడని అర్థమవుతుంది. అంత డబ్బున్న వ్యక్తి కుమారుడికి ఇలా హోమ్ మంత్రి డబ్బును దొంగలించాల్సిన అవసరం ఏంటి? అతనికి అనాథాశ్రమానికి సంబంధం ఏమిటి? అతను కొట్టేసిన డబ్బును ఏం చేశాడు? డొనేషన్లు కూడా అవసరం లేనంతగా తరాలు తినేలా నిధులున్న అనాథాశ్రమానికి అతని వల్ల కలిగిన ఉపయోగం ఏంటి? ఆ అనాథ ఆశ్రమం అతనికి ఎలా ఉపయోగపడింది వంటివన్నీ కథలో భాగం.
ఫస్ట్ టైమ్ , యాజీన్ నిజార్ , దివ్యఎస్ మీనన్