పటాన్‌చెరు | |
— పట్టణం — | |
తెలంగాణ రాష్ట్రంలో పటాన్‌చెరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′N 78°16′E / 17.53°N 78.27°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండలం | పటాన్‌చెరు |
జనాభా (2011) | |
- మొత్తం | 40,332 |
- పురుషుల సంఖ్య | 21,323 |
- స్త్రీల సంఖ్య | 19,009 |
పిన్ కోడ్ | 502319 |
ఎస్.టి.డి కోడ్ |
పటాన్‌చెరు, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలానికి చెందిన పట్టణం .[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థకు వాయవ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది మెదక లోక్‌సభ నియోజకవర్గంలోని, పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ప్ర్రాంతం.ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ సెంట్రల్ జోన్, 13 వ సర్కిల్,116 వవార్డు పరిధికి చెందింది.గతంలో ఇది బీదర్, గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT) కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు బాగా కలుషితం చెందుతుందని అంటారు.
పటాన్‌చెరు 17.53 ° N 78.27 ° E వద్ద ఉంది.సముద్ర మట్టానికి దీని సగటు ఎత్తు 522 మీటర్లు (1712 అడుగులు) గా ఉంది సాకి సరస్సు పటాంచెరు బస్ టెర్మినస్‌కు చాలా దగ్గరలో ఉంది.
గతంలో పటాన్‌చెరు మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని పటాన్‌చెరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఇది కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఇదే పేరుతో ఉన్న మండలంగా 11.10.2016 అక్టోబరు 11 నుండి చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
పటాన్‌చెరు పరిధిలో 2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40,332 మంది ఉన్నారు.వారిలో 21,323 మంది పురుషులు కాగా, స్త్రీలు 19,009 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు 5,647 మంది ఉండగా, వారిలో మగ పిల్లలు 2,869, ఆడ పిల్లలు 2,778 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యులు మొత్తం 26,503 మంది ఉండగా, వారిలో 15,603 మంది పురుషులు కాగా, స్త్రీలు 10,900 మంది ఉన్నారు.[3]