పనామాలో హిందూమతం మైనారిటీ మతం. పనామా దేశంలో దాదాపు 10,000 మంది [1] [2] హిందువులు ఉన్నారు.
హిందువులు మొదట్లో బ్రిటిష్ కాలనీలైన గయానా, ట్రినిడాడ్-టొబాగోల ద్వారా వచ్చారు. మొదటగా 1904 - 1913 మధ్య కాలువ కార్మికులుగా వచ్చారు. వీరిలో చాలామంది మూలాలు భారతదేశం లోను, పాకిస్తాన్‌లోని గుజరాత్, సింధ్ రాష్ట్రాలలోనూ ఉన్నాయి. [3]
పనామాలోని హిందువుల ప్రధాన సంఘాలు పనామానియన్ హిందూ సివిక్ అసోసియేషన్, కృష్ణ రాధా టెంపుల్ సొసైటీ, హిందుస్తానీ సొసైటీ ఆఫ్ పనామా (టెంప్లో హిందూ డి తుంబ ముర్టో), హిందుస్తానీ సొసైటీ ఆఫ్ కొలన్.దేశంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, అంతర్జాతీయ శ్రీ సత్యసాయి బాబా సంస్థ, అంతర్జాతీయ భావాతీత ధ్యానం సంస్థలు కూడా ఉన్నాయి. [4]
పనామాలో ఉన్న రెండు హిందూ దేవాలయాల్లో ఒకటి తుంబా ముర్టోలో ఒక కొండ పైన ఉంది. [5]