పనూన్ కాశ్మీర్

ఎరుపు రంగులో ప్రతిపాదిత పనూన్ కాశ్మీర్ భూభాగం

పనూన్ కాశ్మీర్ (మన కాశ్మీరు) కాశ్మీర్ లోయలో హిందువులు తమ కోసం ప్రతిపాదించుకున్న కేంద్రపాలిత ప్రాంతం. దీన్ని కాశ్మీరీ హిందువుల మాతృభూమిగా ఉద్దేశించారు. 1990 లో కాశ్మీరీ హిందువుల వలస తర్వాత ఈ డిమాండ్ ఏర్పడింది.[1] [2][3][4][5] 1991 మార్గదర్శన్ తీర్మానంలో మాతృభూమి దార్శనికతను విశదీకరించారు. పనూన్ కాశ్మీర్ అనే పేరుతో ఒక సంస్థ కూడా ఉంది.

మూలం, శబ్దవ్యుత్పత్తి

[మార్చు]

పనూన్ కాశ్మీర్ కాశ్మీరీ భాష నుండి వచ్చిన మాట. "మన స్వంత కాశ్మీర్" అని దానికి అర్థం. పనూన్ కాశ్మీర్ సంస్థను కాశ్మీరీ హిందూ రచయిత, కార్యకర్త అగ్నిశేఖర్‌ తోటి కాశ్మీరీ హిందువులు కలిసి 1990 లో స్థాపించారు. ఉగ్రవాదుల నుండి ఏర్పడిన ముప్పు కారణంగా కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ నుండి పెద్దయెత్తున వలస వెళ్ళాక ఈ సంస్థ ఏర్పడింది. కాశ్మీర్‌లో పెరుగుతున్న సాయుధ తిరుగుబాటు కారణంగా దాదాపు 300,000 [6] నుండి 600,000 కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ నుండి వలసపోయారు. అయితే, పనూన్ కాశ్మీర్ అంచనా ప్రకారం ఇది దాదాపు 7,00,000.[7]

పనూన్ కాశ్మీర్ ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతం

[మార్చు]

1991 డిసెంబరులో జమ్మూలో మార్గదర్శన్ రిజల్యూషన్ [8] అనే పేరుతో ఒక తీర్మానాన్ని సంస్థ ఆమోదించింది. దాని విశేషాలు ఇవి:[9][10]

(ఎ) కాశ్మీరీ లోయలో జీలం నదికి తూర్పు, ఉత్తరాన ఉన్న లోయ ప్రాంతాలను కలిపి కాశ్మీరీ హిందువుల కోసం మాతృభూమిని ఏర్పాటు చేయడం.

(బి) జీవించే హక్కు, స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసం, సమానత్వం, చట్ట నియమాలను నిర్ధారించడానికి భారత రాజ్యాంగం ఈ మాతృభూమిలో ప్రత్యక్షరస్ఫూర్తితో వర్తింపజేయబడుతుంది.

(సి) హోంల్యాండ్‌ను కేంద్రపాలిత ప్రాంత హోదాతో కేంద్ర పరిపాలన కింద ఉంచడం;

(డి) గతంలో కాశ్మీర్ నుండి తరిమివేయబడి, తమ స్వదేశానికి తిరిగి రావాలని తహతహలాడుతున్న వారితో సహా ఏడు లక్షల మంది కాశ్మీరీ హిందువులు, కాశ్మీర్‌లో ఉగ్రవాద హింస కారణంగా బలవంతంగా విడిచిపెట్టిన వారితో సహా హుందాగా, గౌరవంగా సమానత్వంతో స్థిరపడగలిగే మాతృభూమి.

పనూన్ కాశ్మీర్ కోరే కొందరు, కాశ్మీర్ లోయలో ఎక్కువ భాగం, శ్రీనగర్, అనంత్‌నాగ్, సోపోర్, బారాముల్లా, అవంతిపోరా వంటి నగరాలను ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చాలని కోరుతున్నారు. అయితే, తాము హిందూ మాతృభూమిని కోరుకోవడం లేదని ఆ సంస్థ పేర్కొంటూ, ముస్లిం పొరుగువారితో కలిసి శాంతియుతంగా జీవించడానికి సిద్ధంగా ఉన్న కాశ్మీరీ హిందువుల కోసం ఈ మాతృభూమి అని చెప్పింది.

మద్దతు

[మార్చు]

పనూన్ కాశ్మీర్ సంస్థ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం కోసం నిలకడగా కోరుతూ వస్తోంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35a ల రద్దును కూడా సంస్థ గట్టిగా సమర్థించింది.[11]

జమ్మూ కాశ్మీరు లోని ఒక రాజకీయ పార్టీ అయిన ఇక్‌జుట్ జమ్మూ, ప్రత్యేక పనూన్ కాశ్మీర్ కావాలనీ, అలాగే కాశ్మీర్ నుండి జమ్మూ డివిజన్‌ను వేరు చేయాలనీ బహిరంగంగా కోరుతోంది.[12][13][14]

వ్యతిరేకత

[మార్చు]

2019 నవంబరు 28 న, న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్, 1989 తిరుగుబాటు తర్వాత ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన మైనారిటీ హిందూ సమాజమైన కాశ్మీరీ పండిట్‌లు తిరిగి రావడానికి కాశ్మీర్ కోసం " ఇజ్రాయెల్ మోడల్ "ను అనుసరించాలని సూచించారు. [15] గంటపాటు సాగిన అతని వీడియో దుమారం రేపింది. దీనివలన సైనిక నియంత్రణ మరింత దిగజారుతుందని, తమల్కు రావలసిన ఉద్యోగాలు బయటివారికి పోతాయని, ముస్లింల మెజారిటీ స్థానాన్ని హిందువులు ఆక్రమించడంతో ముస్లిములు తమ గుర్తింపును కోల్పోతారని కాశ్మీరీ ముస్లింల కార్యకర్తలు కొంతమంది హిందూ కాశ్మీరీలు భయపడ్డారు. ఈ ప్రతిపాదనను "సెటిలర్-కలోనియల్ ప్రాజెక్ట్"తో పోల్చారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రతిపాదనను "భారత ప్రభుత్వ ఫాసిస్ట్ ఆలోచనా ధోరణిని" ప్రతిబింబిస్తున్నట్లు ఖండించాడు.[16][17]

2021 జూన్‌లో గుర్తుతెలియని మిలిటెంట్లు రాకేష్ పండిట్‌ను హత్య చేయడంతో, పనూన్ కాశ్మీర్ గ్రూప్‌లోని పలువురు సభ్యులు ప్రత్యేక హిందూ ప్రాంతాన్ని స్థాపించడానికి సాయుధ పోరాటం చెయ్యాలని ప్రతిపాదించారు. కాశ్మీరీ పండిట్‌లు స్థానిక మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాలనేది ఈ ప్రతిపాదన. ఆ సమావేశాన్ని, వారి ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతాన్నీ ముస్లిం కార్యకర్తలు వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన చర్యలతో పోల్చారు.[18][19][20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Excelsior, Daily (2017-01-09). "Involve 'Panun Kashmir' in talks on return of KPs: Ambardar" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-03-14.
  2. Wirsing, Robert (2003). Kashmir in the Shadow of War: Regional Rivalries in a Nuclear Age (in ఇంగ్లీష్). M.E. Sharpe. p. 149. ISBN 9780765610898.
  3. PTI, (Press Trust of India) (July 28, 2019). "Carve out separate state within India for Kashmiri Pandits along Jhelum river: Panun Kashmir". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-10-25.
  4. "700 eminent Kashmiri Pandits support Centre's decision on Article 370: Panun Kashmir". Business Standard India. Press Trust of India. 2019-08-22. Retrieved 2019-10-25.
  5. "Post 370, Kashmiri Hindus wait to return to their homes". The Sunday Guardian Live (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-19. Retrieved 2019-10-25.
  6. Singh, Devinder (2014-11-21). "Reinventing Agency, Sacred Geography and Community Formation: The Case of Displaced Kashmiri Pandits in India". The Changing World Religion Map (in ఇంగ్లీష్). Dordrecht: Springer Netherlands. pp. 397–414. doi:10.1007/978-94-017-9376-6_20. ISBN 9789401793759.
  7. "A Homeland for the Kashmiri Pandits". Panun Kashmir. Archived from the original on 2013-10-29.
  8. PTI (2017-02-12). "Modi govt has no objection to the homeland for Kashmiri Pandits, says Jitendra Singh". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-12-21.
  9. Noorani, A. G. (2016-07-09). "Kashmir's Pandits". Dawn. Archived from the original on 12 July 2021. Retrieved 2021-12-21.
  10. "Why Homeland? Introduction". Panun Kashmir. Archived from the original on 2013-10-29.
  11. "Panun Kashmir faction wants abrogation of Article 370". 3 February 2007.
  12. "We Should be Trained with Arms, Necessary to Form Israel in Kashmir: Pandit Activist". 9 June 2021.
  13. "Forget Delimitation; Divide Kashmir; Grant Statehood to Jammu: IkkJutt Jammu - the Northern Herald". Archived from the original on 2021-07-10. Retrieved 2024-09-06.
  14. "Chorus grows louder for statehood to Jammu". 10 June 2021.
  15. Ibrahim, Shameel (2020-09-28). "Why Indian-occupied-Kashmir is on the road to settler colonialism". Medium (in ఇంగ్లీష్). Retrieved 2024-02-08.
  16. "Anger over India's diplomat calling for 'Israel model' in Kashmir".
  17. "Bringing the Israeli model to Kashmir".
  18. ""Important to make an Israel": Kashmiri Pandit leaders want military approach". 7 June 2021. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 6 సెప్టెంబరు 2024.
  19. "'If the Israeli people can do it. We can also do it: Normalisation of Israel's colonial desires". The Kashmir Walla. 24 June 2021.[permanent dead link]
  20. "'Sacrifice and surrender': RSS's mantra for Kashmiri Pandit rehabilitation". 14 June 2021. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 6 సెప్టెంబరు 2024.