పరమ వీర చక్ర | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
నిర్మాత | సి కళ్యాణ్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ అమీషా పటేల్ షీల |
ఛాయాగ్రహణం | రమన రాజు |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 12 జనవరి 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం.[1][2] నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించాడు.[3]
ఈ చిత్రం 2011 సంక్రాంతి వారాంతంలో విడుదలైంది. పేళవమైన సమీక్షలు వచ్చాయి [4] అయితే, ఇది 2010 నంది అవార్డులలో నేషనల్ ఇంటిగ్రేషన్ చిత్రం కోసం సరోజిని దేవి అవార్డును గెలుచుకుంది .[5]
చక్రధర్ ( నందమూరి బాలకృష్ణ ) ఒక ప్రసిద్ధ సినీ నటుడు, అయితే అతని తల్లి (జయసుధ) అతని ప్రముఖుడి హోదాను ఇష్టపడదు. ఆమె తన కొడుకును ఆర్మీలో మేజర్‌గా, బొబ్బిలి పులి ( ఎన్‌టి రామారావు ) లాగా, చూడాలని ఆరాటపడుతుంది. చక్రధర్ వివిధ పాత్రలు చేస్తున్నప్పుడు, ఆర్మీ కల్నల్ జితేంద్ర ( మురళి మోహన్ ) తన వద్ద ఒక కథ ఉందని, అందులో చక్రధర్ నటించాలనీ కోరుకుంటాడు. కల్నల్ అతనికి ఆర్మీ మేజర్ - మేజర్ జయ సింహా (ఇతడూ బాలకృష్ణే) కథను వివరించాడు. అయితే, ఒక క్యాచ్ ఉంది. మేజర్ జయ సింహా కల్పిత పాత్ర కాదు, కానీ చక్రధర్ లాగా కనిపించే నిజమైన సైనికాధికారి. భయంకరమైన ఉగ్రవాది - అబ్దుల్ ఘనీని ధైర్యంగా పట్టుకున్నాడు. విషాదమేంటంటే జయసింహా ఇప్పుడు ఇక మాంసపు ముద్దలా మంచంపై (యాంత్రిక వెంటిలేషన్ మీద) పడి ఉన్నాడు. రాజకీయ నాయకులు, కొద్దిమంది ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులూ కలిసి పన్నిన కుట్ర ఫలితం అది. దేశ భద్రతా ప్రణాళికలు రాజీపడకుండా చూసేందుకు కల్నల్ జీతేంద్ర చక్రధర్‌ను మేజర్ లాగా వ్యవహరించమని అడుగుతాడు. చక్రధర్ ఉగ్రవాదులపై ఎలా దాడి చేస్తాడు, మేజర్ గౌరవాన్ని తిరిగి ఎలా తీసుకువస్తాడు అనేది మిగిలిన కథ.[6]
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "లోకాన చీకటిని" | సుద్దాల అశోక్ తేజ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శ్రీకృష్ణ | 7:23 |
2. | "మిత్రా మిత్రా 1" | అనంత శ్రీరాం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత | 4:15 |
3. | "అర్జున ఫల్గుణ" | రామజోగయ్య శాస్త్రి | హేమచంద్ర, మాళవిక | 4:47 |
4. | "మై క్యా కరూ" | సాహితి | హేమచంద్ర, మాళవిక | 4:25 |
5. | "ఎక్కా ఎక్కా" | దాసరి నారాయణరావు | మనో, మాలతి | 3:51 |
6. | "తల్లి కడుపులో" | Dasari Narayana Rao | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 5:59 |
7. | "రాముడైనా" | జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు | మనో | 1:08 |
8. | "మిత్రా మిత్రా 2" | అనంత శ్రీరామ్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత | 4:13 |
మొత్తం నిడివి: | 36:00 |