పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
పరిశ్రమసినిమారంగం
స్థాపన2009
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
బండ్ల గణేష్
ఉత్పత్తులుసినిమాలు
యజమానిబండ్ల గణేష్
వెబ్‌సైట్[1]

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. నటుడు బండ్ల గణేష్ 2009లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సినిమా నిర్మాణ సంస్థలలో ఒకటైన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్, తెలుగు సినిమారంగంలోని ప్రధాన నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ సంస్థ ద్వారా తొలిసారిగా అంజనేయులు సినిమా నిర్మించబడింది. ఇందులో రవితేజ, నయన తార జంటగా నటించగా, పరశురాం దర్శకత్వం వహించాడు. ఇది 2009, ఆగస్టు 12న విడుదలైంది.[1] దాని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹15 కోట్లు వచ్చింది. తరువాత 2012లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 డేస్‌లో దాని అన్ని వెర్షన్‌లతో ₹170 కోట్లు వసూలు చేసి, ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹40 కోట్లు వచ్చాయి. 2013లో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన బాద్ షా సినిమా, తెలుగు సినిమారంగంలో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ₹55 కోట్లతో నిర్మించబడి, 100 రోజుల్లో ₹60 కోట్ల షేర్, ₹115 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీని ప్రీ-రిలీజ్ ఆదాయం అదనంగా ₹50 కోట్లు వచ్చాయి.[2] 2013లో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమా విడుదలయింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకొని, ₹80 కోట్లు వసూలు చేసింది. 2014లో రాం చరణ్ తేజ నటించిన గోవిందుడు అందిరివాడేలే సినిమా విడుదలైంది.[3][4][5]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు దర్శకుడు నటులు ఇతర వివరాలు
1 2009 అంజనేయులు పరశురాం రవితేజ, నయన తార
2 2011 తీన్ మార్ జయంత్ సి పరాన్జీ పవన్ కళ్యాణ్, త్రిష కృష్ణన్, కృతి కర్బంద
3 2012 గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్ ప్రతిపాదించబడింది—సైమా ఉత్తమ చిత్రం
4 2013 బాద్‍షా శ్రీను వైట్ల జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్
5 2013 ఇద్దరమ్మాయిలతో పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్, అమలా పాల్, కేథరీన్ థెరీసా
6 2014 నీజతగా నేనుండాలి జయ రవీంద్ర సచిన్ జోషి, నాజియా హుస్సేన్
7 2014 గోవిందుడు అందరివాడేలే కృష్ణవంశీ రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ
8 2015 టెంపర్ పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్

అవార్డులు

[మార్చు]
క్రమసంఖ్య అవార్డు సంవత్సరం విభాగం నామినీ ఫలితం
1 సినీ'మా' అవార్డులు 2013 ఉత్తమ చిత్రం గబ్బర్ సింగ్ గెలుపు
2 టిఎస్ఆర్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015 ఉత్తమ వినోద చిత్రం బాద్‍షా గెలుపు[6]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Movie review - Anjaneyulu". idlebrain .com. Retrieved 21 January 2021.
  2. http://www.123telugu.com/mnews/baadshah-pre-release-business-crosses-50cr.html
  3. http://www.superwoods.com/news-id-gaabbar-singh-gabar-singh-vs-magadheera-18-08-122658.htm
  4. "Archived copy". Archived from the original on 2014-03-01. Retrieved 21 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Archived copy". Archived from the original on 3 December 2013. Retrieved 21 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "Why TSR Awards Are BEST Awards?". cinejosh.com. 17 July 2015. Retrieved 21 January 2021.

ఇతర లంకెలు

[మార్చు]