పరశురామ్ నాయుడు పెట్ల | |
---|---|
జననం | చెర్లోపాలెం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
భాగస్వామి | అర్చన[1] |
పిల్లలు | అభి, రుషి |
పరశురామ్ (బుజ్జి) తెలుగు సినిమా స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు.[2] 2008లో వచ్చిన యువత సినిమా ద్వారా దర్శకుడిగా మారిన పరశురామ్, ఆంజనేయులు, సోలో, గీత గోవిందం సినిమాలకు దర్శకత్వం వహించాడు.
పరశురామ్ డిసెంబరు 25న విశాఖపట్నం జిల్లా చర్లోపాలెంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబిఏ పూర్తిచేసాడు. జవహర్ నవోదయ విద్యాలయం కొమ్మాది లో చదివారు.
2002లో ఎంబిఏ పూర్తిచేసిన పరశురామ్, తన బంధువు పూరి జగన్నాథ్ దగ్గర ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆంధ్రావాలా, 143 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత 2008లో పరుగు సినిమాకు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టరుగా పనిచేశాడు.
2008లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా యువత సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[3] 2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహించిన ఆంజనేయులు సినిమా కూడా సినీ విమర్శకుల నుండి అనుకూల స్పందనలతోపాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[4]
2011లో నారా రోహిత్ హీరోగా వచ్చిన సోలో సినిమా కూడా విజయవంతమై, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[5] 2012లో రవితేజ హీరోగా వచ్చిన సారొచ్చారు సినిమా సినీ విమర్శకుల ప్రతికూల స్పందనలను అందుకోవడంతోపాటు[6] బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[7]
2018లో విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణా జంటగా నటించిన గీత గోవిందం సినిమా సినీ విమర్శకుల నుండి అనుకూల స్పందనలను అందుకోవడంతోపాటు ఆ సంవత్సరం విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[8]
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
దర్శకుడిగా
క్రమసంఖ్య | సినిమాపేరు | సంవత్సరం | దర్శకుడు | స్క్రీన్ ప్లే | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | యువత | 2008 | Yes | Yes | తొలిచిత్రం |
2 | ఆంజనేయులు | 2009 | Yes | Yes | |
3 | సోలో | 2011 | Yes | Yes | |
4 | సారొచ్చారు | 2012 | Yes | Yes | |
5 | శ్రీరస్తు శుభమస్తు | 2016 | Yes | Yes | |
6 | గీత గోవిందం | 2018 | Yes | Yes | |
7 | సర్కారు వారి పాట | 2022 | Yes | Yes | |
8 | ఫ్యామిలీ స్టార్ | 2024 | Yes | Yes |
సంగీత దర్శకుడిగా