పర్వేశ్ సింగ్ వర్మ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 20 | |||
గవర్నరు | వినయ్ కుమార్ సక్సేనా | ||
---|---|---|---|
ముందు | మనీష్ సిసోడియా | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | అరవింద్ కేజ్రివాల్ | ||
నియోజకవర్గం | న్యూఢిల్లీ | ||
పదవీ కాలం 2013 – 2014 | |||
ముందు | యోగానంద్ శాస్త్రి | ||
తరువాత | నరేష్ యాదవ్ | ||
నియోజకవర్గం | మెహ్రౌలీ | ||
పదవీ కాలం 2014 మే 16 – 2014 మే 16 | |||
ముందు | మహాబల్ మిశ్రా | ||
తరువాత | కమల్జీత్ సెహ్రావత్ | ||
నియోజకవర్గం | పశ్చిమ ఢిల్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఢిల్లీ , భారతదేశం | 7 నవంబరు 1977||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | సాహిబ్ సింగ్ వర్మ, సాహిబ్ కౌర్ | ||
జీవిత భాగస్వామి |
స్వాతి సింగ్ (m. 2002) | ||
బంధువులు | విక్రమ్ వర్మ (మామ) నీనా వర్మ (అత్తమ్మ) సిద్ధార్థ్ సింగ్ వర్మ (సోదరుడు) | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం (బీఏ) ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ) | ||
మూలం | [1] |
పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ (జననం 7 నవంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2013లో ఎన్నికల్లో మెహ్రౌలి విధానసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఆ తరువాత నుండి వరకు లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ, సాహిబ్ కౌర్ దంపతులకు 7 నవంబర్ 1977న జన్మించాడు.[2] ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, కిరోరి మాల్ కాలేజీలలో చదువుకొని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందాడు.[3]
పర్వేశ్ వర్మ మాజీ కేంద్ర మంత్రి & మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు సనిధి సింగ్, ప్రిషా సింగ్, ఒక కుమారుడు శివేన్ సింగ్ ఉన్నారు.[4]
పర్వేష్ వర్మ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపగా ఆయనకు టికెట్ దక్కలేదు.[5] ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో మెహ్రౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి నరీందర్ సింగ్ సెజ్వాల్ పై 4,564 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
పర్వేష్ వర్మ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్‌పై 2,68,586 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7] ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహాబల్ మిశ్రాపై 578486 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[8][9]
పర్వేష్ వర్మ 2025 శాసనసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రివాల్‌పై 3,182 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[10] ఆయన ఫిబ్రవరి 20న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[11][12]