పల్నాడు | |
---|---|
దర్శకత్వం | సుశీంద్రన్ |
రచన | సుశీంద్రన్ |
నిర్మాత | విశాల్ |
తారాగణం | విశాల్, లక్ష్మీ మీనన్, భారతీరాజా, సూరి, సోమసుందరం |
ఛాయాగ్రహణం | మాధి |
కూర్పు | ఆంటోనీ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 2 నవంబర్ 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పల్నాడు 2013లో విడుదలైన తెలుగు సినిమా.[1] విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళంలో ‘పాండ్యనాడు’ పేరుతో, తెలుగులో పల్నాడు పేరుతో 02 నవంబర్ 2013న విడుదలైంది.[2]
శివకుమార్ (విశాల్) బాగా భయస్తుడు, ఓ సెల్ షాప్ నడుపుకొంటూ ఉంటాడు. తమ ఇంటిపైనే అద్దెకుండే మాలతిని (లక్ష్మి మీనన్) ప్రేమిస్తాడు. ఆ ఊరికి పెద్ద దాదా అయిన కాటమ రవి తన మైనింగ్ వ్యాపారానికి అడ్డు తగిలాడని, శివకుమార్ అన్నయ్యని చంపేస్తాడు. దాంతో శివకుమార్, అతని తండ్రి (భారతీరాజా) విడివిడిగా రవిపై పగ తీర్చుకోవాలని పథకం వేసుకుంటారు. పిరికివాడైన శివకుమార్ తన అన్నయ్యను చంపినవాడిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఈ విషయంలో ఎలా విజయం సాధించాడు ? అనేదే మిగతా సినిమా కథ.