పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా | |
---|---|
అసోం రాష్ట్ర జిల్లా | |
![]() బైతలాంగ్సోలోని కొండలు | |
![]() భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి | |
Coordinates (హమ్రెన్): 17°21′N 75°10′E / 17.35°N 75.16°E - 18°19′N 76°09′E / 18.32°N 76.15°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | అసోం |
డివిజన్ | మధ్య అసోం |
రాష్ట్ర ఏర్పాటు | 15 ఆగస్టు 2016 |
ముఖ్య పట్టణం | హమ్రెన్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,035 కి.మీ2 (1,172 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 3,00,320 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ,[2] ఇంగ్లీష్, హిందీ[3] |
• ప్రాంతీయ | కర్బీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. 2015లో కర్బి ఆంగ్లాంగ్ జిల్లా నుండి ఈ కొత్త జిల్లా ఏర్పడింది. జిల్లా ప్రధాన కార్యాలయం హమ్రెన్.[4]
ఈ ప్రాంతంలో జూన్ నెల నుండి సెప్టెంబరు నెల వరకు నైరుతి వేసవి రుతుపవనాల ద్వారా గరిష్ఠ వర్షపాతం కురుస్తుంది.[5] ఈ ప్రాంత తూర్పు భాగం మైదానాలతో, పశ్చిమ భాగం ఎక్కువగా కొండలతో కప్పబడి ఉంటుంది. ఈ జిల్లాలో మైంట్రియాంగ్ నది, కర్బి లాంగ్పి నది, కోపిలి నది, అమ్రేంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. మైంట్రియాంగ్, కర్బి లాంగ్పి నదులపై జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడింది.[6][7]
జిల్లా ప్రధాన కార్యాలయం హమ్రెన్ పట్టణంలో ఉండగా, జిల్లాలో ఒక ఉపవిభాగం (హమ్రెన్ సబ్ డివిజన్) మాత్రమే ఉంది.[8]
పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో హమ్రెన్, బైతలాంగ్సో, ఖెరోని ప్రాంతాలలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
ఇక్కడి జనాభాలో కర్బి, హిల్ తివాస్, బోడో, గారో లకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. బ్రిటిష్ పాలనలో పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాకు వలస వచ్చినవారిలో బెంగాలీలు, బిహారీలు, నేపాలీలు అధికంగా ఉన్నారు.
ఇక్కడ కర్బీ భాషతోపాటు, గారో, తివా, ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ వంటి భాషలను మాట్లాడుతారు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో 3,00,320 జనాభా ఉండగా, అందులో 1,53,763 మంది పురుషులు, 1,46,557 మంది స్త్రీలు ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తిలో 1000 పురుషులకు 973 స్త్రీలు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 85.19% ఉండగా, అందులో 90.19% మంది పురుషులు, 80.19% మంది స్త్రీలు ఉన్నారు.[1]
జిల్లా ప్రధాన కార్యాలయమైన హమ్రెన్ పట్టణం రహదారి మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు కలుపబడి ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి గువహాటి, నాగావ్, దిఫు, లంకా, హోజాయ్, జోవాయి వంటి ముఖ్యమైన ప్రాంతాలకు క్రమం తప్పకుండా బస్సులు నడుస్తాయి.