పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే

పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే
కుండ్లీ–మనేసర్–పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే
పటం
ఎరుపు రంగులో పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HSIIDC)
పొడవు135.6 కి.మీ. (84.3 మై.)
Existed2018 నవంబరు 19–present
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరకుండ్లీ, సోనీపత్
దక్షిణ చివరధోలాగఢ్, పల్వల్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుహర్యానా
Major citiesసోనీపత్, ఖర్‌ఖోడా, బహదూర్‌గఢ్, బద్లీ, ఝజ్జర్, మనేసర్, నూహ్, సోహ్‌నా, హాథిన్, పల్వల్[1]
రహదారి వ్యవస్థ

పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే (వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే -WPE) హర్యానా రాష్ట్రం గుండా వెళ్ళే 135.6 కి.మీ. (84.3 మై.) పొడవైన 6-వరుసల ఎక్స్‌ప్రెస్ వే [2][3][4][5] దీన్ని కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే (KMP ఎక్స్‌ప్రెస్‌వే) అని కూడా అంటారు. తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే, పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే ల ద్వారా ఢిల్లీ నుండి 50,000 కంటే ఎక్కువ భారీ వాహనాలను మళ్లించవచ్చని అంచనా వేసారు.[6][7] ఇది ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.[8] ఈ రెండు ఎక్స్‌ప్రెస్‌వేలు కలిసి ఢిల్లీ చుట్టూ అతిపెద్ద రింగ్ రోడ్‌ను ఏర్పరుస్తాయి.[9][10] ఈ మార్గంలో 10 సుంకంతో కూడిన ప్రవేశాలు, నిష్క్రమణలూ ఉన్నాయి. ఉత్తరం నుండి దక్షిణానికి అవి: కుండ్లీ, ఖర్ఖోడా, బహదూర్‌గఢ్, బద్లీ, ఫర్తుఖ్‌నగర్, పంచగావ్, మనేసర్, తావోరు, సోహ్నా, పల్వల్. [11] 2018 డిసెంబరులో సుంకాలు కార్లకు ఒక కి.మీకు రూ 1.35, తేలికపాటి మోటారు వాహనాలకు ఒక కి.మీకి రూ 2.18, ట్రక్కులు, బస్సులకు రూ 4.98 సుంకం ఉండేది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.[11]

ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రదేశంలో ఢిల్లీ-సోనిపట్-రోహ్తక్-గురుగ్రామ్-ఫరీదాబాద్ సమ్మేళనంలో భాగంగా ఒకదాని పక్కన ఒకటి ఉండే ఐదు కొత్త గ్రీన్‌ఫీల్డ్ నగరాలను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీ మెట్రో 5 వ దశలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెంట కొత్త మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు.[12]

చరిత్ర

[మార్చు]
కేంద్ర మంత్రి, హర్యానా ముఖ్యమంత్రి నిర్వహించిన ఎక్స్‌ప్రెస్‌వేపై సమీక్షా సమావేశం

53 కి.మీ.ల పొడవున్న మనేసర్ - పల్వాల్ విభాగాన్ని 2016 ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించాడు.[13][14] ఎక్స్‌ప్రెస్‌వేలో మిగిలిన 83 కి.మీ. కుండ్లి - మనేసర్ విభాగాన్ని 2018 నవంబరు 19 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు.[15] 2018 డిసెంబరులో KMP ఎక్స్‌ప్రెస్‌వేపై సుంకం వసూలు ప్లాజాలను ప్రారంభించారు.[16]

135.6 కి.మీ.ల పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (BOT) పద్ధతిలో నిర్మించాలని 2003 లో మొదట ప్రతిపాదించారు. కుండ్లి, సోనిపట్ సమీపంలోని NH-1 నుండి పల్వాల్ సమీపంలోని NH-2 వరకు నాలుగు వరుసల యాక్సెస్-నియంత్రిత రహదారిగా దీన్ని ప్రతిపాదించారు.[17] ఈ రహదారి పైకి వాహనాలను దారి మళ్లించడం వల్ల ఢిల్లీకి ప్రయోజనం ఉంటుంది కాబట్టి, ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ ఖర్చులో సగం భరించేందుకు ఢిల్లీ రాష్ట్రం అంగీకరించింది.[18] 2006 లో హర్యానా ప్రభుత్వం పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌పై పని ప్రారంభించింది.[19] టెండర్‌ను KMP ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్‌కు అప్పగించారు. జూన్ 2009 లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావాల్సి ఉండగా, దాన్ని 2013 మే కి మార్చారు.[20] 2016 లో పదేపదే ఆలస్యం చేయడం వల్ల హర్యానా ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి, KMP ఎక్స్‌ప్రెస్‌వేస్‌కు, రుణదాతలకూ పరిహారంగా రూ 1,300 కోట్లు చెల్లించింది.[21] [22] 2016 జనవరిలో భారత సుప్రీంకోర్టు జోక్యం తర్వాత, ప్రాజెక్టును పునరుద్ధరించి, కొత్త బిడ్‌లను ఆహ్వానించారు.[23] ప్రణాళికను నాలుగు వరుసల నుండి ఆరు వరుసలకు పెంచారు.[24] పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వేను 2018 నవంబరులో ప్రారంభించారు.

మార్గం, ఇంటర్‌ఛేంజ్‌లు

[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 10 సుంకం వసూలు చేసే ప్రవేశాలు, నిష్క్రమణలూ ఉన్నాయి. కింది వాటితో సహా, 52 అండర్‌పాస్‌లు, 23 ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.[25] [26] [27] : [26]

ఇంటర్‌చేంజ్‌ల జాబితా

స్థానం హైవే మార్గం ఇంయ్టర్‌చేంజ్ రకం సంబంధిత మల్టీమోడల్ ప్యాసింజర్ ఇంటర్‌చేంజ్
కుండ్లి NH 44 ఢిల్లీ - పానిపట్ - అంబాలా Gరోడ్ క్లోవర్లీఫ్ కుండ్లి MMTS
ఖర్ఖోడా NH18 ఢిల్లీ- బవానా -ఖార్ఖోడా-రోహ్తక్ రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్
బహదూర్‌ఘర్ NH 9 ఢిల్లీ- రోహ్తక్ - హిసార్ - సిర్సా క్లోవర్లీఫ్ బహదూర్‌ఘర్ MMTS
బద్లీ SH123 ఝజ్జర్ - బద్లీ - గుర్గావ్ రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్
ఫరూఖ్‌నగర్ NH15A ఢిల్లీ- ఝజ్జర్ రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్
పంచగావ్ NH48 గురుగ్రామ్- భివాడి - రేవారి - జైపూర్ క్లోవర్లీఫ్ పంచగావ్ చౌక్ MMTS
టౌరు NH 919 గురుగ్రామ్-సోహ్నా-భివాడి-జైపూర్ రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్
సోహ్నా NH 248A గురుగ్రామ్- నుహ్ - ఫిరోజ్‌పూర్ జిర్కా రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్
పాల్వాల్ NH19 ఫరీదాబాద్ - హోడల్ - మధుర - ఆగ్రా - యమునా ఎక్స్‌ప్రెస్ వే క్లోవర్లీఫ్ బలరాంగర్ MMTS

సౌకర్యాలు

[మార్చు]

ఈ ఎక్స్ప్రెస్వేలో ఇంధనం నింపే స్టేషన్లు, 2 ట్రక్ స్టాప్లు, 4 బస్ స్టాండ్లు, హెలిప్యాడ్తో కూడిన 1 మెడికల్ ట్రామా సెంటర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, రిఫ్రెష్మెంట్, వినోద సౌకర్యాలతో కూడిన 5 ప్యాసింజర్ మల్టీమోడల్ ట్రాన్సిట్ స్టేషన్లు (ఎంఎంటిఎస్) ఉన్నాయి.

ఇచి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kumar, Ashok (9 April 2015). "Work on KMP Expressway to start soon". The Hindu. Retrieved 9 January 2016.
  2. WPE opens in November 2018, Times of India, November 2018.
  3. "Delhi to get new stretch of Western Peripheral Expressway, vehicular pollution to go down".
  4. "3 projects in Haryana to be completed soon".
  5. Barman, Sourav Roy (28 May 2018). "First 'Smart' highway holds out hope for a congested, choking capital". The Indian Express. Retrieved 5 June 2018.
  6. "83km Kundli-Manesar-Palwal stretch may not be opened on Haryana Diwas". Retrieved 5 June 2018.
  7. Roy, Sidhartha (19 November 2018). "Western Peripheral Expressway: 50,000 vehicles may go off Delhi roads". The Times f India. Retrieved 20 November 2018.
  8. "Residents of Delhi to wait for another 3 months to get breather from heavy vehicles, subsequent air pollution".
  9. "PM Modi to inaugurate Western Peripheral Expressway: All you need to know".
  10. "Ring around Delhi: Final piece to fall in place as Western Peripheral Expressway opens today".
  11. 11.0 11.1 Toll booths to open at all KMP entries, exits, December 2018.
  12. "KMP Expressway- Western Peripheral Expressway Route Map, Toll Charges and More - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-27. Retrieved 2024-07-06.
  13. "After 9-yr delay, KMP eway to be completed by August". Archived from the original on 2018-07-30. Retrieved 2024-08-30.
  14. "Kundli-manesar stretch of western peripheral e-way ready before time".
  15. "Gurgaon: Kundli-Manesar expressway inauguration today". Retrieved 5 November 2018.
  16. "7 toll plazas begin operations on KMP e-way, 200 marshals deployed to manage traffic".
  17. "KMP Expressways achieves financial closure of BOT project". Money Control. 9 January 2007. Archived from the original on 4 March 2016. Retrieved 9 January 2016.
  18. Nangia, Tarun (14 July 2013). "Rough road ahead". The New Indian Express. Archived from the original on 18 July 2013. Retrieved 9 January 2016.
  19. "Western Peripheral Expressway likely to open next month".
  20. Nair, Vishwanath (5 April 2013). "Lenders ask developer to give up". The Financial Express. Retrieved 9 January 2016.
  21. Rao, Hitender (1 December 2014). "BJP govt in dilemma over KMP E-way project". Hindustan Times. Archived from the original on 25 January 2015. Retrieved 9 January 2016.
  22. Dash, Dipak K (23 January 2015). "Haryana asks Centre to take over incomplete expressway". The Times of India. Retrieved 9 January 2016.
  23. Bhatnagar, Gaurav Vivek (24 February 2015). "KMP Expressway put on fast track". The Hindu. Retrieved 9 January 2016.
  24. Dash, Deepak K (9 April 2015). "Finally, work on bypass e-ways begins". The Times of India. Retrieved 9 January 2016.
  25. "KMP e-way to partially open in March". The Indian Express. 22 December 2010. Retrieved 22 May 2016.
  26. 26.0 26.1 "Chaos, theft, accident: All is not well with Delhi's 'smart' eastern expressway".
  27. "KMP to miss August deadline too, could take 3 more months".