పసి | |
---|---|
దర్శకత్వం | దురై |
రచన | దురై |
నిర్మాత | సి.కె. షణ్ముగం లలిత జి. దురై |
తారాగణం | శోభ ఢిల్లీ గణేష్ విజయన్ |
ఛాయాగ్రహణం | వి. రంగ |
కూర్పు | ఎం. వెల్లైచామి |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | సునీత సినీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 21 డిసెంబరు 1979[1] |
సినిమా నిడివి | 138 నిముషాలు |
భాష | తమిళం |
పసి, 1979 డిసెంబరు 21న విడుదలైన తమిళ సినిమా. సునీత సినీ ఆర్ట్స్ బ్యానరులో సి.కె. షణ్ముగం లలిత, జి. దురై నిర్మించిన ఈ సినిమాకు దురై దర్శకత్వం వహించాడు. ఇందులో శోభ, ఢిల్లీ గణేష్, విజయన్ ముఖ్య పాత్రలు పోషించారు.[2] విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమాకు భారత జాతీయ చలనచిత్ర అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో రెండేసి అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా పెట్ ప్యార్ ఔర్ పాప్ పేరుతో హిందీలోకి రీమేక్ చేయబడింది.
అతిథి పాత్ర
కమర్షియల్ సినిమాలు తీయడంలో పేరుగాంచిన దురై, వాస్తవిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందించాడు. ఈ సినిమాకు శంకర్ గణేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమా కోసం తమిళనాడు ప్రభుత్వం ₹ 100,000 సబ్సిడీని అందించింది.[3]
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది.[3] దురై స్వయంగా 1984లో స్మితా పాటిల్, రాజ్ బబ్బర్ నటీనటులుగా హిందీలో పెట్ ప్యార్ ఔర్ పాప్ అనే పేరుతో రీమేక్ చేసాడు.[4][5]
1980, జనవరి 13 నాటి తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ పేదల జీవితాలను వాస్తవికంగా చిత్రీకరించినందుకు ఈ సినిమాను ప్రశంసించింది. శోభ నటన, రంగా కెమెరా వర్క్, దురై స్క్రిప్ట్- డైలాగ్‌లు కూడా ప్రశంసలు అందుకున్నాయి.[6] అదే సంవత్సరం తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శించబడింది.[7]
సెంథిల్‌కి ఈ సినిమా మంచి గుర్తింపును ఇచ్చింది. దాంతో అతను 1980లలో తమిళ సినిమాలోని హాస్యనటులలో ఒకరిగా స్థిరపడ్డాడు.[8] శోభ స్నేహితురాలు చెల్లమ్మ పాత్రలో నటించిన మరో నూతన నటి సత్య, ఈ సినిమా తర్వాత "పసి" పేరుతో పిలువబడింది.[9][3]
27వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కొద్దిసేపటికే, సినిమా 100వ రోజు వేడుకకు ఒక రోజు ముందు, నటి శోభ చెన్నై లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.[3][10]