పా. రంజిత్ | |
---|---|
![]() పా. రంజిత్ | |
జననం | పా. రంజిత్ 8 డిసెంబరు 1982 |
జాతీయత | ![]() |
విద్యాసంస్థ | గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై |
వృత్తి | దర్శకుడు రచయిత నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అనిత |
పిల్లలు | ఇద్దరు (కుమార్తె, కుమారుడు) |
పా. రంజిత్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత. తమిళనాడులోని అవడి జిల్లాలో కర్లపక్కం గ్రామంలో జన్మించిన పా. రంజిత్ చిత్రకారుడు కావాలనుకుని చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆయన సినీరంగంలో మొదట శివ షణ్ముగం, థాగపన్‌సామి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చిత్ర నిర్మాతలు లింగుస్వామి, వెంకట్ ప్రభు దగ్గర పని చేశాడు. పా. రంజిత్ 2012లో తొలిసారిగా అట్టకతి సినిమా ద్వారా దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి కబాలి, కాలా, సార్పట్ట పరంపర సినిమాల ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.[1] పా. రంజిత్ 2018లో కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా 19 మంది సభ్యులతో ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’ పేరుతో సంగీత బందాన్ని ఏర్పాటు చేశాడు.[2]
సంవత్సరం | సినిమా | నటీనటులు | ఇతర |
---|---|---|---|
2012 | అట్టకతి | దినేష్ , నందిత శ్వేత, ఐశ్వర్య రాజేష్,కబాలి విశ్వనాథ్, కలైరాసన్ | |
2014 | మద్రాస్ | కార్తీ, కేథరిన్ థ్రెసా, రిత్విక, చార్లెస్ వినోత్, కలైరాసన్ | |
2016 | కబాలి | రజినీకాంత్, రాధిక ఆప్టే,సాయి దంసిక, నాజర్, రిత్విక, కలైరాసన్ | |
2018 | కాలా | రజినీకాంత్, నానా పటేకర్, సముద్రఖని, ఈశ్వరీ రావు,హుమా క్కురేషి | |
2021 | సార్పట్ట పరంపర | ఆర్య, పశుపతి, అనుపమ కుమార్, కలైరాసన్, దుషారా విజయన్ [3] జాన్ కొక్కెన్, జాన్ విజయ్ | ప్రైమ్ వీడియో |
2022 | నచ్చతిరమ్ నగర్‌గిరతు | కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్,[4] హరి కృష్ణన్, కలైరాసన్, షభీర్ కల్లరక్కల్ | |
2024 | తంగలాన్ | విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి | |
2024 | సార్పట్ట పరంపర: రౌండ్ 2 | ఆర్య |
సంవత్సరం | సినిమా | ఇతర |
---|---|---|
2018 | పరియేరమ్ పెరుమాళ్ | |
2019 | ఇరండామ్ ఉలగపోరిన్ కడైసి గుండు | [5] |
2021 | రైటర్ | |
2021 | పేరు ఖరారు కాలేదు | [6] |
సంవత్సరం | సినిమా | అవార్డు | వర్గం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2012 | అట్టకత్తి | జయ టీవీ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | [7] |
2014 | మద్రాసు | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | [8] |
ఉత్తమ కథ | గెలిచింది | [9] | |||
ఎడిసన్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | [10] | ||
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ దర్శకుడు - తమిళం | నామినేట్ | [11] | ||
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు - తమిళం | గెలిచింది | [12] | ||
విజయ్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | [13] | ||
2016 | కబాలి | ఎడిసన్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | [14] |
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ దర్శకుడు | నామినేట్ | [15] | ||
IIFA ఉత్సవం | ఉత్తమ దర్శకుడు | నామినేట్ | [15] | ||
2018 | కాలా | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ డైలాగ్ రైటర్ | గెలిచింది | [16] |
2018 | పరియేరుమ్ పెరుమాళ్ | బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ | ఉత్తమ నిర్మాత | గెలిచింది | [17] |
నార్వే తమిళ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ చిత్రం | గెలిచింది | [18] | ||
ఎడిసన్ అవార్డులు | ఉత్తమ చిత్రం | గెలిచింది | [19] | ||
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ చిత్రం - తమిళం | గెలిచింది | |||
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ చిత్రం - తమిళం | గెలిచింది | |||
2021 | సర్పత్త పరంబరై | గలాట్టా క్రౌన్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | గెలిచింది | |
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ చిత్రం - తమిళం | గెలిచింది | [20] | ||
2022 | నచ్చతీరం నగరగిరదు | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ చిత్రం | గెలిచింది | [21] |